ఒక పాటను దాచేసిన రంగస్థలం టీం

Rangasthalam Team hide one single Song

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఈ సంవత్సరం ప్రారంభం అయ్యి మూడు నెలలు పూర్తి కావస్తుంది. ఇప్పటి వరకు ఒక మంచి కమర్షియల్‌ సక్సెస్‌ పడినది లేదు. తెలుగు ప్రేక్షకులు పెద్ద సినిమా కోసం, భావి విజయం కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు రామ్‌ చరణ్‌ ‘రంగస్థలం’ చిత్రంతో ప్రేక్షకుల ఎదురు చూపులకు ఫుల్‌స్టాప్‌ పడబోతున్నట్లుగా సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సుకుమార్‌ దర్శకత్వంలో పూర్తి పల్లెటూరు నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఈ చిత్రంపై అంచనాలు పెంచేలా ఇప్పటి విడుదలైన మూడు పాటలు సూపర్‌ హిట్‌ అయ్యాయి. తాజాగా మరో రెండు పాటలతో కలిపి మొత్తం పాటలను చిత్ర యూనిట్‌ సభ్యులు విడుదల చేశారు.

మొదట విడుదల చేసిన మూడు పాటలు మరియు తాజాగా విడుదలైన రెండు పాటలు మంచి ట్యూన్స్‌తో, పాత తరం ప్రేక్షకులకు మరియు కొత్త తరం శ్రోతలకు నచ్చే విధంగా ఉన్నాయి. అయితే ఈ చిత్రంలో మరో పాట కూడా ఉందని, అయితే ఆ పాటను చిత్ర యూనిట్‌ సభ్యులు సినిమా విడుదలైన తర్వాత జోడివ్వాలని భావిస్తున్నారు. ఈ మద్య కొన్ని సీన్స్‌ను లేదా ఒకటి లేదా రెండు పాటలను సినిమా విడుదలైన తర్వాత కొన్ని రోజులకు చేర్చుతున్నారు. అలాగే ఈ చిత్రం విడుదలైన వారం రోజుల తర్వాత ఆ పాటను చేర్చే ఆలోచనలో చిత్ర యూనిట్‌ సభ్యులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రీ రిలీజ్‌ వేడుక కార్యక్రమాల్లో నిమగ్నం అయ్యి ఉన్నారు. త్వరలోనే ఆరవ పాటపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.