బాలీవుడ్ లో మరో ప్రేమ జంట పెల్లిపీటలు ఎక్కబోతున్నారు. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునే… రణబీర్ కపూర్ తో బ్రేక్ అప్ అయిన తర్వాత, బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ తో ప్రేమలో పడిపోయింది. గతంలో రణ్ వీర్-దీపిక ఎంగేజ్ మెంట్ రహస్యంగా మాల్దీవ్స్ లో జరిగిందని బాలీవుడ్ మీడియా కోడై కూసింది. కానీ ఈ న్యూస్ ని ఇరువురి కుటుంబాలు ఎవ్వరు కూడా ఖండించలేదు. ఆ తర్వాత పెళ్లి గురించి బోలెడన్ని వార్తలు వచ్చాయి. అప్పుడు కూడా ఇటు దీపికా పదుకునే గాని, అటు రణ్ వీర్ సింగ్ ఎవ్వరు కూడా పెళ్లిపై రియాక్షన్ కాలేదు.
కానీ ఇప్పుడు బాలీవుడ్ లో తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, నవంబరు 10న వీరిద్దరూ ఇటలీలో పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయినట్లుగా చెబుతున్నారు. ఈ పెళ్ళికి అత్యంత సన్నిహితులతో, మీడియా కి దూరంగా రహస్యంగా పెళ్లి చేసుకొని, రిసెప్షన్ గ్రాండ్ గా ఏర్పాటు చేయాలనీ ఇరు కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. ఇదే తరహాలో గతంలో క్రికెటర్ విరాట్ కోహ్లి, అనుష్క శర్మలు మీడియాకి దూరంగా, కొద్దిమంది కుటుంబ సభ్యుల మధ్య, రహస్యంగా ఇటలీలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.