చిత్తూరు జిల్లా పలమనేరు మండలం మండిపేటలోని అటవీ ప్రాంతంలో ఇటీవల ఓ ఆడ ఏనుగు మృతి చెందింది. అనారోగ్య కారణాలతోనే ఏనుగు మృతి చెంది ఉంటుందని అధికారులు భావించారు. కానీ పోస్టుమార్టమ్ రిపోర్టులో ఏనుగు మృతికి అసలు కారణం బయటపడింది. ఓ మగ ఏనుగు ఆ ఆడ ఏనుగుని రేప్ చేయడం వలెనే మృతి చెందిందని రిపోర్టులో తేలింది. మండలంలోని మండిపేట కోటూరు అటవీ బీట్ పరిధిలోని చెత్తపెంట అటవీ ప్రాంతంలో ఒక ఏనుగు మృతదేహాన్ని కొందరు పశువుల కాపరులు గుర్తించారు. అనారోగ్యంతో రెండు రోజుల కిందట ఆ ఏనుగు మృతి చెంది ఉండవచ్చని వారు మొదట భావించారు. అదే విషయాన్ని ఉన్నతాధికారులకు తెలిపారు. ఆ సమయంలో అక్కడే ఓ పిల్ల ఏనుగు కూడా కనిపించిందని అధికారులతో చెప్పారు. పశువుల కాపర్లు ఇచ్చిన సమాచారం మేరకు అక్కడికి వెళ్లి చూడగా ఏనుగు చనిపోయి కనిపించింది. అనారోగ్యంతోనే చనిపోయి ఉంటుందని అధికారులు భావించారు. అనంతరం పోస్టుమార్టమ్ రిపోర్ట్ కోసం ఏనుగు మృతదేహాన్ని తరలించారు. రిపోర్టులో లైంగిక దాడి వల్లే అది మృతి చెందినట్టు తేలింది.