Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
‘ఊహలు గుసగుసలాడే చిత్రంతో హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేక బ్రాండ్‌ను ఏర్పర్చుకుని గత కొంత కాలంగా కెరీర్లో ఒక్కో అడుగు చొప్పున వేస్తూ వెళ్తున్న ముద్దుగుమ్మ రాశిఖన్నా. ఇటీవలే ఈ అమ్మడు వరుణ్ తేజ్ నటించిన ‘తొలిప్రేమ’ చిత్రంలో నటించి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ చిత్రం అందుకున్న విజయంతో రాశిఖన్నాకు పెద్ద హీరోల సరసన నటించే అవకాశం వస్తుంది. తాజాగా ఈమెకు ఒక తమిళ చిత్రంలో కూడా ఛాన్స్ దక్కింది. క్రేజ్ పెరుగుతున్న సమయంలో పుకార్లు పెరగడం చాలా కామన్. అలాగే ఇప్పుడు రాశిఖన్నాపై పలు రకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ముఖ్యంగా రాశిఖన్నా వివాహం గురించి సోషల్ మీడియాలో ఎక్కువ పోస్ట్‌లు వస్తున్నాయి.
రాశిఖన్నా టీం ఇండియా క్రికెటర్ బూమ్రాతో ప్రేమాయణం సాగిస్తుందని, ఈమె త్వరలోనే బూమ్రాను వివాహం చేసుకుంటుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో స్వయంగా ఆమె ఒక కార్యక్రమంలో ఆ విషయంపై క్లారిటీ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. బూమ్రాను తాను ప్రేమిస్తున్నాను అని, పెళ్లి అంటూ మీడియాలో వస్తున్న వార్తలను కొట్టి పారేసింది. అసలు బూమ్రాతో తనకు పెద్దగా పరిచయం లేదని, ఆయన క్రికెటర్‌గా మాత్రమే తెలుసని, ఆయన వ్యక్తిగతంగా తెలియదు అంటూ తేల్చి చెప్పింది. మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవాలు అంటూ చెప్పడం జరిగింది. మరి ఇప్పుడైనా మీడియాలో వార్తలకు ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి.