Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్‌గా పరిచయం అయిన ముద్దుగుమ్మ రాశిఖన్నా. ఈ అమ్మడు తాజాగా ఎన్టీఆర్‌తో ‘జైలవకుశ’ చిత్రంలో నటించడంతో స్టార్ హీరోయిన్ ఇమేజ్‌ను దక్కించుకుంది. ఈమెకు వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటించే అవకాశాలు వస్తున్నాయి. ఈ సమయంలోనే ఈమెకు పలు స్టార్ హీరోల సినిమాల్లో ఐటెం సాంగ్స్ ఆఫర్స్ కూడా వచ్చాయి. ఇటీవల ఒక స్టార్ హీరో సినిమాలో ఐటెం సాంగ్ చేయాలంటూ దర్శకుడు ఈమెను సంప్రదించాడు. అందుకోసం 30 లక్షల పారితోషికాన్ని కూడా ఇచ్చేందుకు సిద్దం అయ్యాడు. కాని ఇప్పట్లో తాను ఐటెం సాంగ్ చేయను అంటూ తేల్చి చెప్పింది.
ఆ దర్శకుడికి నో చెప్పిన రాశిఖన్న తనకు ‘సుప్రీమ్’ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శకుడు అనీల్‌రావిపూడికి మాత్రం ఓకే చెప్పింది. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాజా ది గ్రేట్’ చిత్రంలో ఐటెం సాంగ్‌ను ఈ అమ్మడు చేసింది. రవితేజతో ఈ అమ్మడు ఐటెం సాంగ్‌లో ఆడి పాడటం జరిగింది. దిల్‌రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాకు రాశిఖన్నా ఐటెం సాంగ్ హైలైట్‌గా నిలుస్తుందని అంటున్నారు. ఈ అమ్మడు ఈ ఐటెం సాంగ్‌ను పైసా తీసుకోకుండా చేసిందట. అనీల్‌రావిపూడిపై అభిమానంతో ఈ ప్రత్యేక పాటను చేశాను అంటూ చెబుతున్న రాశిఖన్నా పారితోషికంగా దిల్‌రాజు ఇస్తాను అన్న అమౌంట్‌ను తిరష్కరించిందని తెలుస్తోంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 30 లక్షలను అభిమానం పేరుతో రాశిఖన్నా వద్దనడం అందరికి ఆశ్చర్యంను కలిగిస్తుంది. అభిమానం చూపినందుకు ఆ దర్శకుడు కూడా ఈమెపై ఎప్పుడో ఒకప్పుడు మళ్లీ అభిమానం చూపిస్తాడేమో చూడాలి. అంటే మరోఅవకాశాన్ని అనీల్ ఇస్తాడేమో చూడాలి.