Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలుగులో ప్రస్తుతం టాప్ హాట్ యాంకర్స్ ఎవరు అంటే ముందు వినిపించే పేరు రష్మీ అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. జబర్దస్త్‌తో వెలుగులోకి వచ్చిన రష్మీ హీరోయిన్ రేంజ్‌లో ఎక్స్‌పోజింగ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. జబర్దస్త్‌కు ముందు దాదాపు పది సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉంటూ వచ్చింది. అయినా కూడా రష్మీకి పెద్దగా గుర్తింపు రాలేదు. ఆ సమయంలో చాలా కష్టాలు పడ్డాను అని, ఆర్థిక ఇబ్బందుల కారణంగా నరకం అనుభవించాను అంటూ చెప్పుకొచ్చింది. యాంకర్‌గా గుర్తింపు వచ్చిన తర్వాత ఈమె సినిమాల్లో కూడా నటించేందుకు సిద్దం అయ్యింది.
పలు సినిమాల్లో మరీ హాట్ పాత్రలో హద్దుమీరి మరీ ఎక్స్‌పోజింగ్ చేసింది. ఒక తెలుగు అమ్మాయి ఈ స్థాయిలో అందాల ప్రదర్శణ చేయడంను కొందరు తప్పుబడుతున్నారు. ఏమాత్రం హద్దు పద్దు లేకుండా రష్మీ గ్లామర్‌గా నటిస్తుందని విమర్శలు వస్తున్నాయి. తనపై వస్తున్న విమర్శలపై తాజాగా ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది. తాను డబ్బు కోసమే ఇలా గ్లామర్‌గా నటిస్తున్నాను అని, ఆర్థికంగా తాను ఎంత ఇబ్బందుల పడ్డానో తనకు మాత్రమే తెలుసు అంటూ కన్నీరు పెట్టుకుంది. రష్మీ ప్రస్తుత జీవితం వేరు, ఇంతకు ముందు జీవితం వేరు. ఆ జీవితంలో నరకం చూసిన తాను ఇప్పుడు డబ్బుకోసమే ఇలా చేస్తున్నాను అని, ఎక్స్‌పోజింగ్ చేయడం తనకు ఇష్టం లేకున్నా తప్పడం లేదని రష్మీ వాపోయింది.