హీరోయిన్స్ అవకాశాలు రాని సమయంలో హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలకు ఓకే చెబుతూ ఉంటారు. సీనియర్ హీరోయిన్స్ ఎక్కువగా హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలు చేస్తారు. ఒకసారి హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలు చేస్తే మళ్లీ హీరోలతో రొమాన్స్ చేసే పాత్రలు రావడం చాలా అరుదు అని చెప్పుకోవచ్చు. ఒక్కరు ఇద్దరు మాత్రమే హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలు చేసి మళ్లీ హీరోలతో అవకాశాలు దక్కించుకోగలిగారు. అందుకే హీరోయిన్స్ అవ్వకాశాలు అస్సలు లేని సమయంలో మాత్రమే లేడీ ఓరియంటెడ్ చిత్రాన్ని చేసేందుకు ముందుకు వస్తారు. తాజాగా రాశిఖన్నా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు లేడీ ఓరియంటెడ్ చిత్రంలో నటించాలని ఉంది అంటూ చెప్పుకొచ్చింది.
ఊహలు గుసగుసలాడే చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అయిన ముద్దుగుమ్మ రాశిఖన్నా ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినా కూడా ఫలితం దక్కలేదు. తొలిప్రేమ చిత్రం ఈమెకు మంచి సక్సెస్‌ను తెచ్చి పెట్టినా కూడా తాజాగా విడుదలైన ‘శ్రీనివాస కళ్యాణం’ చిత్రం మాత్రం తీవ్రంగా నిరాశ పర్చింది. ఆ చిత్రం కారణంగా ఈమెకు అవకాశాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందనిపిస్తుంది. అందుకే చేసేది లేక హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలకు ఈమె మొగ్గు చూపుతుందనిపిస్తుంది. అయితే రాశిఖన్నా అప్పుడే హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలు చేయక పోవడం మంచిదని, ఇంకా సమయం తీసుకుని, ఆమె కమర్షియల్ హీరోయిన్‌గా ప్రయత్నిస్తే బెటర్ అంటూ సినీ వర్గాల వారు చెబుతున్నారు. మరి రాశిఖన్నా తాను అనుకున్నట్లుగా లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు ఫిక్స్ అయిపోతుందా అనేది చూడాలి.