Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మాస్ మహారాజా రవితేజ కాస్త మూసరాజా రవితేజ అనేట్లుగా ఆయన చేస్తున్న చిత్రాలు ఉన్నాయి. ‘రాజా ది గ్రేట్’ చిత్రంతో సక్సెస్‌ను దక్కించుకున్న రవితేజ తాజాగా ‘టచ్ చేసి చూడు’ చిత్రంతో అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. పరమ రొటీన్ చిత్రంగా ‘టచ్ చేసి చూడు’ను ప్రేక్షకులు తేల్చి పారేశారు. ఏమాత్రం ఆకట్టుకోని కథనంతో తెరకెక్కిన ఆ చిత్రాన్ని రవితేజ ఎలా చేశాడు అంటూ విమర్శలు వస్తున్నాయి. రవితేజ ఇలాగే సినిమాలు చేసుకుంటూ వెళ్తు మరో రెండు మూడు సంవత్సరాల్లో హీరోగా కెరీర్‌కు గుడ్ బై చెప్పే పరిస్థితి వస్తుందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
రవితేజ ‘టచ్ చేసి చూడు’ చిత్రం తర్వాత కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ‘నేల టికెట్’ అనే చిత్రాన్ని చేస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభం అయిన ఆ సినిమాను సమ్మర్ చివర్లో విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరో వైపు తనకు సక్సెస్ ఇచ్చిన శ్రీనువైట్ల దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేయాలని రవితేజ భావించాడు. అందుకే వరుస పరాజయాల పాలవుతున్న దర్శకుడు శ్రీనువైట్లకు రవితేజ ఛాన్స్ ఇచ్చాడు. ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ అనే టైటిల్‌తో రవితేజ, శ్రీనువైట్లల కాంబినేషన్ చిత్రం తెరకెక్కబోతుందని సమాచారం అందుతుంది. శ్రీనువైట్ల దర్శకత్వంలో చేయబోతున్న సినిమాపై రవితేజ ఆలోచనలో పడ్డట్లుగా తెలుస్తోంది. ‘నేల టికెట్’ ఫలితాన్ని బట్టి శ్రీనువైట్ల దర్శకత్వంలో సినిమాపై నిర్ణయం తీసుకోవాలని రవితేజ భావిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది.