కత్తి ఉచ్చులో పవన్…రెచ్చిపోతే తిప్పలే.

reason behind kathi mahesh targeting on janasena chief pawan kalyan

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

జనసేన అధినేత,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ చేస్తున్న యుద్ధం అందరూ చూస్తూనే వున్నారు. ఇదో టైం పాస్ వ్యవహారం అయిపోయింది. పొద్దున్నే న్యూస్ పేపర్ కోసం ఎదురు చూసినట్టు, సోషల్ మీడియాలో ఇంటరెస్టింగ్ హెడ్డింగ్ పెట్టిన స్టోరీలో మ్యాటర్ ఏంటో తెలుసుకోడానికి ఆత్రపడినట్టు ఈ రోజు పవన్ ని కత్తి ఎలా టార్గెట్ చేస్తాడో అని ఎదురు చూసే బ్యాచ్ కూడా తయారైంది. ఈ బ్యాచ్ లో కత్తి మహేష్ సపోర్ట్ చేసే వాళ్ళ కన్నా పవన్ అభిమానులే ఎక్కువ. కొన్ని సినిమాలకు పాజిటివ్ పబ్లిసిటీ కన్నా నెగటివ్ పబ్లిసిటీ బాగా వర్కౌట్ అవుతుంది. కత్తి మహేష్ అదే ప్లాన్ తో పవన్ ఫాన్స్ ఆవేశాన్ని ని అడ్డం పెట్టుకుని పవన్ ని తన ఉచ్చులోకి లాగేసాడు.

mahesh kathi comments on pawan kalyan

కత్తి మహేష్ పోరాటం అందరికీ గుర్తు ఉంటుంది కానీ పవన్ మీద ఆయన ఈ స్థాయిలో రెచ్చిపోడానికి కాటమరాయుడు సినిమా రివ్యూ గురించి ఫాన్స్ రియాక్షన్ అనో , తన ఫోన్ నెంబర్ బయటపెట్టారనో అనుకుంటే మాత్రం పొరపాటే. ఒక్క పవన్ ఫాన్స్ మాత్రమే కాదు కొత్త సినిమా రివ్యూ టైం లో మిగిలిన హీరోల ఫాన్స్ కూడా ఇలాగే కత్తికి ఫోన్ చేసిన సందర్భాలు వున్నాయి. అంత మాత్రాన ఆ హీరోలు అందరి మీద కత్తి పోరాటం చేస్తున్నాడా ?లేదు. కానీ పవన్ ని టార్గెట్ చేస్తూ రెచ్చగొట్టడం వెనుక నిర్దిష్ట లక్ష్యాలు, ప్రణాళికలు కనిపిస్తున్నాయి.

kathi mahesh and pawan kalyan,

కత్తి మహేష్ అసలు టార్గెట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్. 2019 ఎన్నికల్లో జనసేన ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగేలా చేయడమే కత్తి ప్లాన్. అందుకోసం ఎంత రెచ్చగొట్టడానికైనా ఆయన రెడీ. పవన్ ఒంటరి పోటీ తో ఓట్ల రాజకీయంలో జనసేన బలహీనత జనానికి చెప్పడంతో పాటు టీడీపీ ని దెబ్బ కొట్టొచ్చు అని కత్తి ఆలోచన . పైగా పవన్ ని రెచ్చగొట్టడం ఈజీ అని కూడా ఆయన అనుకుంటున్నారు .జనసేన ఒంటరిగా పోటీ చేస్తే టీడీపీ కి నష్టం, వైసీపీ కి లాభం అన్న కోణంలో కత్తి ముందుకు వెళుతున్నారు. కత్తికి ఈ విషయంలో జగన్ పార్టీ ఫుల్ గా సపోర్ట్ చేస్తున్న విషయం సోషల్ మీడియా ని ఫాలో అయితే తేలిగ్గా అర్ధం అయిపోతుంది. ఈ విషయాన్ని అర్ధం చేసుకోకుండా కత్తి ఉచ్చులో పడ్డారు పవన్ , ఆయన అభిమానులు. రెచ్చగొట్టారు కదా అని రెచ్చిపోతే సినిమాల్లో లాగా ఉండదు రాజకీయ వ్యవహారం. ఈ తేడా తెలుసుకుని సంయమనంతో వ్యవహరిస్తే మంచిది. లేదంటే కత్తి ప్లాన్ సక్సెస్ కావడానికి పవన్ అభిమానులే సహకరించినట్టు అవుతుంది.