Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
Reason Behind Ram charan Rangasthalam 1985 Title
‘ధృవ’ వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత రామ్ చరణ్ చేస్తున్న సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. పైగా సుకుమార్ దర్శకత్వంలో చరణ్ మూవీ అవ్వడంతో ఆకాశంలో అంచనాలు ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు సుకుమార్ తనదైన శైలిలో మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకునే విధంగా, విభిన్న స్క్రీన్‌ప్లేతో చరణ్‌తో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. సుకుమార్ ఈ చిత్రానికి విభిన్నంగా ‘రంగస్థలం 1985’ అనే టైటిల్‌ను ఖరారు చేయడం జరిగింది. ఈ టైటిల్‌పై మొదట వ్యతిరేకత వచ్చింది. స్వయంగా చిరంజీవి కూడా దీనికి నో చెప్పాడని, దర్శకుడు సుకుమార్ ఈ టైటిల్‌ను పట్టుబట్టి పెట్టించాడని అంటున్నారు.
ఇంతకు అంతగా దర్శకుడు సుకుమార్ ఈ టైటిల్ కోసం ఎందుకు పట్టుబట్టాడు అనే విషయంపై ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. విశ్వసనీయంగా చిత్ర యూనిట్ సభ్యుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం 1985 సంవత్సర కాలంలో జరిగిన కథ ఇది. ఆ కాలంలో హీరో ఒక రంగస్థల నటుడు. అలాగే హీరోయిన్ తండ్రి కూడా రంగస్థలంపై నాటకాలు వేస్తూ ఉంటాడు. సినిమాలో నాటకాలకు ప్రముఖ స్థానం ఉంటుందట. అందుకే ఈ సినిమాకు రంగస్థలం అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుత ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా సుకుమార్ అప్పటి కథను తెరకెక్కిస్తున్నాడు. సినిమా విడుదల తర్వాత టైటిల్‌పై పూర్తి క్లారిటీ వస్తుందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
మరిన్ని వార్తలు:
కుల్లుకునేది పవన్ ఫ్యాన్సేనా..?