Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రపంచంలో పలు దేశాల్లో బిగ్‌బాస్‌కు మంచి ఆధరణ ఉంది. హిందీలో కూడా దాదాపు 10 సంవత్సరాల నుండి నిర్విరామంగా సాగుతూనే ఉంది. హిందీ నుండి తెలుగులోకి రావడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. మాటీవీని స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ వారు దక్కించుకున్న తర్వాత ఈ షోను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం జరిగింది. బిగ్‌బాస్ తెలుగులో అనగానే అందరిలో ఆసక్తి కలిగింది. ఇక ఎన్టీఆర్ హోస్ట్ అనగానే అంచనాలు మరింతగా పెరిగాయి.
అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా బిగ్‌బాస్‌ను ఎన్టీఆర్ లీడ్ చేశాడు. ఇంటి సభ్యులు 16 మంది కూడా ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేశారు. ఒక్కరు ఇద్దరు తప్ప అంతా కూడా వారి ప్రతిభతో ఆకట్టుకున్నారు. బిగ్‌బాస్ సీజన్ 1 ముగిసింది. ఈ సీజన్‌లో మొదటి నుండి ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంటూ వచ్చిన శివబాలాజీ గెలిచాడు. గ్రాండ్ ఫినాలేలో శివబాలాజీని ఎన్టీఆర్ విజేతగా ప్రకటించాడు. మొదటి నుండి కోపంతో అందరి దృష్టిని ఆకర్షించిన శివబాలాజీ ఆ తర్వాత అతడి కోపంకు అర్థం ఉందని ప్రేక్షకులు గ్రహించారు. ఇంటికి పెద్ద వాడిగా వ్యవహరిస్తూ, ఏ సమస్యలో తల దూర్చకుండా, తన పనేంటో తాను చూసుకుంటూ, ఎవరైనా తన వద్దకు వచ్చి సమస్య చెప్పినప్పుడు దాని పరిష్కారం కోసం కృషి చేసేవాడు. టాస్క్ ఏదైనా కూడా మొహమాట పడకుండా, ఆటను ఆటలాగే ఆడాలి అంటూ అందరికి చెబుతూ వచ్చాడు. శివబాలాజీ అన్ని విషయాలను బ్యాలన్స్ చేయడంతో పాటు, ఇంట్లో సభ్యులందరికి వండి పెట్టడంతో పాటు, ఇతర పనుల్లో కూడా సాయం చేసేవాడు. ఇక శివబాలాజీకి సినిమాల్లో నటించిన గుర్తింపు కూడా ఉండటంతో ప్రేక్షకులు ఈయనకు ఎక్కువగా ఓట్లు వేసి ఉంటారు అని విశ్లేషకులు భావిస్తున్నారు.
శివబాలాజీతో పాటు టైటిల్ విన్నర్‌గా హరితేజ పేరు వినిపించింది. ఈ సీజన్‌లో హరితేజ ప్రత్యేక ఆకర్షణ అనడంలో ఏమాత్రం సందేమం లేదు. ఆమె ప్రతి పనిలో కూడా ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసింది. అందుకే హరితేజకు ఛాన్స్ ఎక్కువ ఉందని అంతా భావించారు. కాని చివరి వారంలో ఆమె కాస్త ఢల్ అయినట్లుగా కనిపించింది. ఇంకా ఎప్పుడె వెళ్దాం అనే ఎదురు చూపులు ఆమెలో కనిపించాయి. కొన్ని సందర్బాల్లో ఏడ్చేయడంతో పాటు, కొన్ని సార్లు ఆమె యాక్టివ్‌గా లేకపోవడంతో ప్రేక్షకులు హరితేజకు ఓటు వేయకుండా శివబాలాజీకి ఓటు వేయడం జరిగింది. ఇక ఆదర్ష్ మొదటి నుండి కూడా ఒక విభిన్నమైన వ్యక్తిగా కనిపిస్తూ వచ్చాయి. చివరికి కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోయాడు. కాని ఈ స్థాయిలో ఆదర్ష్ వస్తాడని ఎవరు ఊహించలేదు. ఊహకు అందని ఎన్నో బిగ్‌బాస్‌లో జరిగాయి. అదే విధంగా బిగ్‌బాస్ విజేతగా శివబాలాజీ ఎంపిక అయ్యాడు.