Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
శ్రీదేవి.. 54 ఏళ్లు. ఇంత చిన్న వయస్సులోనే చనిపోవటానికి కారణాలు ఏంటీ.. గుండెపోటు ఎందుకు వచ్చింది.. నిత్యం ఆరోగ్యంపై ఎంతో దృష్టి పెట్టే హీరోయిన్ అకస్మాత్తుగా ఎందుకు చనిపోయింది.. . ఇప్పుడు ఈ ప్రశ్నలే అందరికీ తొలిచేస్తున్నాయి. . శ్రీదేవి వయస్సు 54 ఏళ్లు. 16 ఏళ్లకే సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అతిలోక సుందరి.. నిత్యం యవ్వనంగా ఉండాలని తహతహలాడింది. మొదటి నుంచి తన శరీర సౌందర్యంపై ఎక్కువగా దృష్టి పెట్టింది శ్రీదేవి. సినిమా ఇండస్ట్రీలో నెట్టుకురావాలంటే నిత్యం.. అందంగా.. చురుగ్గా.. ఆరోగ్యంగా కనిపిస్తూ ఉండాలి. దీంతో శ్రీదేవి చాలాసార్లు శస్త్రచికిత్సలు కూడా చేయించుకున్నది. బాహ్య సౌందర్యాన్ని కాపాడుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. 1990లోనే శ్రీదేవి ముక్కుకు ఆపరేషన్ చేయించుకున్నది.
ఆ తర్వాతే ఆమె అందం రెట్టింపు అయ్యింది అంటారు అభిమానులు. ఆ తర్వాత కూడా ఫిట్ నెస్ కోసం నిరంతరం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఈ తరం హీరోయిన్స్ తో పోటీపడుతూ తన అందాన్ని రెట్టింపు చేసుకోవటం కోసం బాడీ షేపింగ్ రిస్క్ తీసుకున్నారు.శ్రీదేవి ఇటీవలి శస్త్ర చికిత్సలతో అందాన్ని పెంచుకునేందుకు ప్రయత్నించారని సినీ ఇండస్ట్రీ అంటోంది. లైపో సక్షన్ బాడీ షేపింగ్ కోసం చాలానే రిస్క్ తీసుకున్నారు. ఫేస్ లిఫ్టింగ్, బ్రెస్ట్ ఇంప్లాంటేషన్ వంటి ఆపరేషన్స్ కూడా చేయించుకున్నారు. శ్రీదేవి ఇటీవలే ఓ ఫంక్షన్ కు హాజరైంది. అప్పుడు ఆమె పెదవులు వాచి ఉన్నాయి.
సర్జీరీ చేయించుకున్నారనే ప్రచారం జరిగింది. 50 ఏళ్ల వయస్సులో ఇలాంటి సర్జరీలు చేయించుకోవటంపై ఆందోళన కూడా వ్యక్తం అయ్యింది. ఇక ఇటీవల శ్రీదేవి బరువు పెరిగారు. దీంతో లైపో సక్షన్ సర్జరీ చేయించుకున్నారని ప్రచార కూడా ఉంది. ఆరు నెలల క్రితం బ్రెస్ట్ సర్జరీ కూడా జరిగినట్లు ప్రచారం ఉంది.నిరంతరం ఫిట్ నెస్ పై దృష్టి పెడుతూ.. యవ్వనంగా కనిపించటం కోసం పదే పదే ఆపరేషన్స్ చేయించుకోవటం కూడా ఆమెపై ఒత్తడి పెరిగింది. మానసిక ఆందోళనకు గురైంది. దీనికితోడు కఠినమైన ఆహార నియమాలు కూడా గుండెపోటుకు కారణంగా కనిపిస్తున్నాయని అంటున్నారు డాక్టర్లు.