టీకాంగ్రెస్ లో రెడ్డి వర్సెస్ బీసీ

reddy-Vs-BCs-Fight-In-Telan

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

తెలంగాణ కాంగ్రెస్ ప్రతిపక్షంగా సత్తా చూపించలేకపోతున్నా.. గ్రూపు పాలిటిక్స్ లో మాత్రం అధికార పార్టీనే కాదు అన్ని పార్టీల్ని మించిపోయింది. ఇంకా ఎన్నికలకు చాలా సమయమున్నా.. ఇప్పట్నుంచే టికెట్లకు సంబంధించి రెండు ప్రధాన సామాజిక వర్గాలకు గొడవ మొదలైంది.

టీకాంగ్రెస్ లో అగ్రనాయకత్వమంతా రెడ్డి సామాజికవర్గమే. వీరు ఎప్పట్నుంచో కాంగ్రెస్ కు అండ, దండగా ఉన్నారు. ఎన్ని పార్టీలొచ్చినా వీరు మాత్రం కాంగ్రెస్ ను వదల్లేదు. పైగా కష్టకాలంలో బాగా ఆదరించారు. అయితే తెలంగాణలో ఎక్కువగా ఉన్న బీసీలు మాత్రం వీరి తీరుపై అసంతృప్తిగా ఉన్నారు.

గత ఎన్నికల్లో పార్టీకి బలం లేని స్థానాలు బీసీలకు ఇచ్చారని, అందుకే ఒక్క సీటూ గెలవలేదని, ఇప్పుడు ఈ సాకుతో అసలుకే ఎసరు పెడుతున్నారని ఏకంగా అధిష్ఠానానికే బీసీ నేతలు కంప్లైంట్ ఇచ్చారు. సగం సీట్లివ్వకపోతే.. వేరే ప్రత్యామ్నాయాలు చూసుకుంటామని హెచ్చరించారట.

మరిన్ని వార్తలు:

ఎన్నారైలకు కీలక పదవులిస్తున్న ట్రంప్

తెలుగు రాష్ట్రాల నుంచి పదవులెవరికి..?

2024 వరకు ఫిక్సైపోయారా..?