పెళ్లి అయినా స్నేహితులుగా..!

Renu Desai And Pawan Kalyan Is Good Friends Even Marriage

రేణుదేశాయ్‌ రెండవ పెళ్లికి సిద్దం అయ్యింది. వారం రోజుల క్రితం రేణుదేశాయ్‌ వివాహ నిశ్చితార్థం అయ్యింది. పెళ్లికి ముందు వరకు పిల్లలకు సంబంధించిన ప్రతి ముఖ్యమైన విషయంలో పవన్‌ కళ్యాణ్‌ మరియు రేణుదేశాయ్‌లు పాల్గొంటూ వచ్చారు. ఇద్దరి పిల్లల సంతోషం కోసం రేణు మరియు పవన్‌లు స్నేహితుల మాదిరిగా ఉంటూ ఉన్నారు. అయితే రేణుదేశాయ్‌ రెండవ పెళ్లి తర్వాత పవన్‌కు దూరంగా ఉండే అవకాశం ఉందని, పవన్‌తో ఆమె ఇకపై కలిసే అవకాశం లేదని అంతా భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో రేణుదేశాయ్‌ ఈ విషయమై మాట్లాడుతూ తాము గతంలో మాదిరిగానే ఉంటామంటూ చెప్పుకొచ్చింది.

తాజాగా ఒక మీడియా సంస్థతో మాట్లాడిన రేణుదేశాయ్‌.. పవన్‌ కళ్యాణ్‌ అంటే తనకు ఎప్పటికి గౌరవం అని, ఆయన నాకు స్నేహితుడు అని, నాకు సంబంధించిన ప్రతి విషయంలో ఇప్పటి వరకు ఆయన సలహాలు తీసుకుంటూ వచ్చాను. పిల్లల సంతోషం కోసం ఇద్దరం మంచి స్నేహితులుగా ఉంటూ వస్తున్నాం. వారికి తల్లి దండ్రి ఇద్దరం కూడా అవసరం. అందుకే ఇద్దరం విడాకుల తర్వాత కూడా కలిసి వారి అవసరాలు తీర్చుతున్నాం అంటూ చెప్పుకొచ్చింది. నేను మరో పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఆయనతో స్నేహంగా ఉంటూ, పిల్లల అవసరాలు తీర్చుతాం అంటూ పేర్కొంది. తామిద్దరం ఎప్పటికి స్నేహితులుగా ఉండి పోవాలని నిర్ణయించుకున్నాం. అలాగే జీవితాంతం ఉంటాం అంటూ చెప్పుకొచ్చింది. మరి పెళ్లి అయిన తర్వాత రేణుదేశాయ్‌ వర్షన్‌ ఏమైనా మారుతుందా అనేది చూడాలి.