అవును… అందుకే ఆయన్ను రహస్యంగా ఉంచుతున్నాను

Renu Desai says the reason why didn't release second husband Photo

గత కొంత కాలంగా రేణుదేశాయ్‌ విషయమై సోషల్‌ మీడియాలో తెగ చర్చ జరుగుతున్న విషయం తెల్సిందే. పవన్‌ మాజీ భార్య అయిన రేణుదేశాయ్‌ రెండవ వివాహంకు సిద్దపడిన నేపథ్యంలో ఆమెపై పవన్‌ ఫ్యాన్స్‌ సోషల్‌ దాడిని కొనసాగిస్తున్నారు. ఫ్యాన్స్‌ చేస్తున్న దాడిని ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్న రేణుదేశాయ్‌ వారికి భయపడే తనకు కాబోయే భర్తను దాచిపెట్టినట్లుగా చెప్పుకొచ్చింది. తాజాగా రేణుదేశాయ్‌ ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చింది. తన భర్త మరియు తన రెండవ వివాహం గురించి ఆసక్తికర విషయాలను ఆమె చెప్పుకొచ్చింది.

రేణుదేశాయ్‌ మాట్లాడుతూ… తాను చేసుకున్న మొదటి పెళ్లి మాత్రమే ప్రేమ వివాహం అని, ఇది ఎంత మాత్రం ప్రేమ వివాహం కాదని, తాను పెళ్లి అనుకోలేదు. కాని తన కుటుంబ సభ్యులు మరియు శ్రేయోభిలాషులు బలవంతంగా వివాహం చేశారు అని, ఈ వివాహం పెద్దలు కుదిర్చిన వివాహం అని చెప్పుకొచ్చింది. సంవత్సరం క్రితం తాను రెండవ పెళ్లికి సంబంధించి ఒక పోస్ట్‌ను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాను. ఆ సమయంలో ఫ్యాన్స్‌ చాలా నీచంగా కామెంట్స్‌ చేశారు. ఒకవేళ పెళ్లి చేసుకుంటే అతడిని చంపేస్తాం అంటూ హెచ్చరించారు. అందుకే నా వివాహం మరియు నిశ్చితార్థం విషయాన్ని బయటకు చెప్పాలని భావించలేదు. నాకు కాబోయే వ్యక్తిని కూడా ఇప్పటి వరకు చూపించక పోవడానికి కూడా కారణం అదే అని, ఫ్యాన్స్‌ ఏదైనా చేసేందుకు సిద్దపడతారనే ఉద్దేశ్యంతో తాను ఆ ఫొటోను రివీల్‌ చేయలేదు అంటూ చెప్పుకొచ్చింది. ఫ్యాన్స్‌ నన్ను వదినా అంటే తప్పు పట్టను అని, కాకుంటే వదినా అంటూ పవన్‌తో నన్ను కలపవద్దని భావిస్తున్నాను అంటూ రేణుదేశాయ్‌ చెప్పుకొచ్చింది.