భార్యగా నేనుండగానే పవన్ వేరే యువతితో బిడ్డను కన్నారు : రేణు దేశాయ్

Renu Desai Reveals Reason behind her Divorce with Pawan Kalyan

ప్రస్తుతం సోషల్ మీడియాలో రేణు దేశాయ్ కి సంబందించిన రూమర్స్ చాలా వస్తున్నాయి. కావాలని పవన్ మీద రాజకీయ పరంగా కుట్రలు చేయాలనీ రేణు దేశాయ్ చెప్పినట్లుగా కథనాలను ప్రసారం చేస్తున్నారు. ఈ సమయమ్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంలో ఓ సంచలనాత్మకమైన విషయాన్ని ఆయన రెండో మాజీ భార్య రేణుదేశాయ్ వెల్లడించారు. తను మళ్లీ పెళ్లి చేసుకుంటున్న సందర్భంలో ఓ ఇంటర్యూను యూట్యూబ్ లో పోస్ట్ చేశారు. పదకొండేళ్ల పాటు కాపురం చేసిన పవన్ కల్యాణ్ తనకు తెలియకుండా… వేరే యువతితో ఎఫైర్ పెట్టుకుని.. ఓ బిడ్డను కన్నారని…ఆ ఇంటర్యూలో రేణుదేశాయ్ వెల్లడించారు. అందువల్లే విడాకులు తీసుకున్నట్లు స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్ , రేణుదేశాయ్ విడిపోయినట్లు బయటకు తెలిసిన సమయంలో చాలా మంది ఆశ్చర్యపోయారు. రేణు దేశాయ్ పవన్ కల్యాణ్ విడిపోయి చాలాకాలమే అయింది. అయితే ఈ ఇద్దరిలో ఎవరు విడాకులు కోరారనే విషయాన్ని మాత్రం ఇద్దరూ కూడా ఎక్కడా ప్రస్తావించలేదు. ఇద్దరి మధ్య ఏం జరిగిందన్న విషయం చాలా కాలం బయటకు రాలేదు. పవన్ కల్యాణ్ సహా రేణు దేశాయ్ కూడా  ఎప్పుడూ చెప్పలేదు.

తాజా ఇంటర్వ్యూలో ఇదే ప్రశ్న రేణు దేశాయ్ కి మళ్ళీ ఎదురైంది. అందుకామె స్పందిస్తూ ” ఇంతకాలం చాలా ఇంటర్వ్యూస్ లో ఈ ప్రశ్న ఎదురైనా నేను ఎక్కడా సమాధానం చెప్పలేదు. కానీ ఇప్పుడు నాకు మరొకరితో పెళ్లి ఫిక్స్ అయింది కనుక చెప్పవచ్చని అనుకుంటున్నాను. ఏ ఇంటికైతే కోడలిగా వెళుతున్నానో వాళ్లు కూడా నన్ను ఈ ప్రశ్న అడిగారు. జరగనున్నది అరేంజ్డ్ మేరేజ్ కనుక .. ఈ విషయానికి సంబంధించి నేను ఇచ్చిన ఇంటర్వ్యూస్ వీడియోలను కూడా వాళ్లు చూశారు. ‘నీ తప్పులేనప్పుడు నిజం చెప్పడానికి ఎందుకు ఆలోచించడం?’ అని వాళ్లు నన్ను అడిగారు. అందుకే ఈ సారి నిజం చెప్పేయాలని నిర్ణయించుకున్నాను. విడాకులు నేను అడగలేదు .. ఈ విషయం కల్యాణ్ గారికి తెలుసు .. దేవుడికి తెలుసు. విడాకులు కావాలని ఆయన అడిగారు .. నాకు కోపం వచ్చింది. విడాకుల ప్రస్తావన వచ్చినప్పుడు భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవ జరుగుతుందో .. అదే మా మధ్య జరిగింది. ఆయనకే విడాకులు కావాలి ఆయనే అడిగారు అంటూ ఈ విషయాన్ని చెప్పడానికి కూడా నాకు చాలా బాధగా వుంది” అంటూ ఆమె ఆవేదనతో ఇబ్బంది పడ్డారు.ఈ విషయంలో తాను ఎంతో మథనపడ్డానని చివరికి పిల్లల భవిష్యత్ కోసం విడాకులు తీసుకోవాలనుకున్నానన్నారు. రెండో పెళ్లికి సంబంధించి తను ఎదుర్కొంటున్న మానసిక వేదనను అందరి ముందు పెట్టడానికి ఆమె ఓ ప్రముఖ జర్నలిస్టుకు ఇంటర్యూ ఇచ్చారు.