పెళ్లిపై మళ్లీ వివరణ ఇచ్చింది

renu desai clarity again her second marriage issue

పవన్‌ కళ్యాణ్‌ మాజీ భార్య రేణుదేశాయ్‌ రెండవ పెళ్లికి సిద్దం అయ్యింది. రెండవ పెళ్లికి సంబంధించిన వివాహ నిశ్చితార్థం కూడా పూర్తి అయ్యింది. రేణుదేశాయ్‌ వివాహం పట్ల కొందరు అనాశక్తిని కనబర్చుతున్నారు. పవన్‌ పిల్లల జీవితాలు నాశనం అవుతాయని, ఈ వయస్సులో పెళ్లి చేసుకోకుంటే ఏంటీ అంటూ ప్రశ్నిస్తున్నారు. దాంతో పదే పదే వారి వ్యాఖ్యలపై రేణుదేశాయ్‌ వివరణ ఇస్తూ వస్తుంది. తాజాగా సోసల్‌ మీడియాలో తనపై వస్తున్న విమర్శలపై రేణుదేశాయ్‌ వివరణ ఇవ్వడం జరిగింది. గతంలోనే తన రెండవ పెళ్లి. ప్రేమ పెళ్లి కాదని, అవసరం కోసం పెళ్లి చేసుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చింది, ఇందులో ప్రేమ ఉంటుందని తాను భావించడం లేదు అంటూ కూడా చెప్పుకొచ్చింది. తాజాగా మరోసారి అదే విషయాన్ని నిర్థారించింది.

తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈమె మాట్లాడుతూ తాను చేసుకున్న మొదటి వివాహం ప్రేమ వివాహం అని, అయితే ఇప్పుడు చేసుకోబోతున్న వివాహం మాత్రం ప్రేమ వివాహం కాదని చెప్పుకొచ్చింది. ఇది ఒకరకంగా చెప్పాలి అంటే పెద్దలు నిర్ణయించిన పెళ్లి అంటూ పేర్కొంది. తాను వద్దనుకున్నా కూడా పెద్దలు మరియు పిల్లలు ఒత్తిడి చేయడం వల్లే ఈ పెళ్లికి ఒప్పుకున్నట్లుగా చెప్పుకొచ్చింది. తన జీవితానికి పెళ్లి అవసరం లేదని తాను భావించాను. కాని తన వారు మాత్రం తనకు రెండవ పెళ్లి అవసరం అని, ఇప్పుడు కాకున్నా భవిష్యత్తులో అయినా నాకు తోడు అవసరం అవుతుందని వారు భావించారు. అందుకే వారు ఒత్తిడి చేయడంతో వివాహంకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాను అంటూ చెప్పుకొచ్చింది.