పవన్ ఫ్యాన్స్ కి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన రేణు !

renu desai counter attack to pawan kalyan fans

రెండు దేశాయ్ రెండవ వివాహం విషయం ఎన్నో మలుపులు తిరుగుతోంది. సోషల్ మీడియాలో రెండు దేశాయ్ రెండవ వివాహం, పవన్ కళ్యాన్ తో విడాకుల విషయం గురించి హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది. రేణు దేశాయ్ పై పెద్ద ఎత్తున ట్రోలింగ్ కూడా జరుగుతోంది. ఈ విషయంలో రెండు దేశాయ్ కూడా కొంత ఘాటుగానే స్పందిస్తోంది. పవన్‌తో విడాకుల విషయమై ఇటీవల రేణు చేసిన వ్యాఖ్యలు సంచలనమైన సంగతి తెలిసిందే. పవన్‌ను నేను విడాకులు అడగలేదని చెప్పిన రేణు.. పవర్ స్టార్ వ్యక్తిగత జీవితాన్ని తప్పుబడుతూ ఆరోపణలు చేసింది. ‘పదకొండేళ్లు తనతో కాపురం చేసిన వ్యక్తి వేరే అమ్మాయితో సంబంధం పెట్టుకుని తనతో ఇంకో పాపను కన్నాడు.. నా స్థానంలో మీరుంటే ఏం చేసేవార’ని ఆమె పవన్ లేడీ ఫ్యాన్స్‌ను ప్రశ్నించింది.

రేణు దేశాయ్ రెండో పెళ్లి వార్తలు బయటకు వచ్చిన దగ్గర్నుంచి పవన్ ఫ్యాన్స్ కొందరు ఆమెను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. దీంతో రేణు.. తన ఎంగేజ్‌మెంట్ తర్వాత ట్విట్టర్ ఖాతాను డిలీట్ చేసింది. ఇటీవల స్వప్నతో చిట్ చాట్ అంటూ రేణు ఇచ్చిన ఇంటర్వ్యూను పవన్ ఫ్యాన్స్ తప్పుబట్టారు. ఈ ఇంటర్వ్యూ తర్వాత రేణు దేశాయ్ అబద్దాలు చెబుతోందని పవన్ అభిమానులు ఆరోపించారు. పవన్, రేణు మధ్య విడాకులు ఖరారైంది 2011 లో అని కానీ పోలినా జన్మించింది 2013 లో అందువలన రేణు దేశాయ్ అబద్దం చెబుతున్నారనే విషయం స్పష్టం అవుతోందని ఫ్యాన్స్ వాదిస్తున్నారు. ఈ ఆరోపణల పట్ల రేణు వివరణ ఇచ్చారు.

‘‘బేబీ పోలినా పుట్టింది 13 మార్చి 2012. [9 నెలలు అంటే గర్భధారణ అయ్యింది జులై 2011]. తర్వాత అంటే, 16 మార్చి 2012న విడాకులు ఖరారయ్యాయి. పాప పుట్టిన విషయం తెలిసిన తర్వాత రేణు పవన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ విషయాన్నే ఇంటర్వ్యూలో తెలియజేశారని రేణు పీఆర్ టీం సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. తనతో విడిపోవడానికి ముందే పవన్‌కు అన్నా లెజినోవాతో అనుబంధం ఉందని ఈ పోస్ట్ ద్వారా రేణు మరోసారి స్పష్టం చేసినట్టయ్యింది. విడాకులు రావడానికి ముందే పవన్ లెజినోవాతో కొత్త జీవితం ప్రారంభించారని రేణు పోస్టును బట్టి అర్థం చేసుకోవచ్చు. 8 ఏళ్ల క్రితం జరిగిపోయిన అంశం గురించి పట్టుకొని ఏదో మైలేజ్ పొందాలని అనుకోవడం వల్ల పొలిటికల్‌గా బలపడాల్సిన తరుణంలో పవన్ వీక్ అవుతాడు. ఈ లాజిక్ మరచిన పవన్ ఫ్యాన్స్ అనవసరంగా పవన్ పేరు చెడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నరేమో అని విశ్లేషకులు భావిస్తున్నారు.