Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మన దేశంలో అమెరికా అంటే ఎంత మోజుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే అక్కడి సెనేటర్లకు కూడా భారత్ అంటే కాస్త ఎట్రాక్షన్ ఎక్కువగానే ఉంటుంది. ట్రంప్ కూడా హెచ్ 1 బీ వీసాల విషయంలో రహస్యంగా బాథపడుతుంటాడని సోషల్ మీడియాలో జోకులు చక్కర్లు కొడుతున్నాయి.
గ్రీన్ కార్డు కోసం పన్నెండేళ్లు ఆగాలన్న కథనాలపై రిపబ్లికన్ సెనేటర్లు మండిపడ్డారు. అర్హులైన వాళ్లకు కూడా అంత లేటుగా గ్రీన్ కార్డులు ఇస్తే అది అమెరికాకే నష్టమని కుండబద్దలు కొట్టారట. పైగా గ్రీన్ ల్యాండ్ ను, ఇండియాను ఒకే గాటన కట్టడంపై ఆందోళన వ్యక్తం చేశారట.
ప్రపంచంలో జనాభా పరంగా ఇండియా, చైనా పెద్ద దేశాలు. మొత్తం భూమ్మీద నలభై శాతం జనాభా అక్కడే ఉంది. అంత పెద్ద దేశాల్ని గౌరవించకుండా.. సరైన జనాభాయే లేని గ్రీన్ ల్యాండ్ కు, రెండో అత్యధిక జనాభా ఉన్న ఇండియాకు ఒకే సంఖ్యలో గ్రీన్ కార్డులు ఇవ్వడం తప్పని, రూల్స్ మార్చాలని కోరడం ఎన్నారైలకు ఊరటనిచ్చింది.
మరిన్ని వార్తలు