ప్రభుత్వ ఉద్యోగాల ప్రమోషన్ల విషయంలో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీ కోటా ఇవ్వడం కుదరదని కోర్టు తేల్చి చెప్పింది. ప్రభుత్వోద్యోగాల ప్రమోషన్ పై 2006 తీర్పును పున:సమీక్షించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉద్యోగాల పదోన్నతుల విషయంలో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది.
పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీ కోటా ఇవ్వడం కుదరదని దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది. ప్రభుత్వోద్యోగాల ప్రమోషన్ పై 2006 తీర్పును పున:సమీక్షించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 2006లో ఇచ్చిన తీర్పుపై అటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీర్పును పునఃపరిశీలించాలంటూ కోర్టును ఆశ్రయించాయి. ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారు వెనకబడి ఉన్నారు కాబట్టి వారి కులాన్ని దృష్టిలో ఉంచుకుని ఉద్యోగాల్లో పదోన్నతులు కల్పించాలని కోర్టును ఆశ్రయించాయి.