తెలంగాణలో గిగ్ వర్కర్ల భద్రత కోసం చట్టం తయారు చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దేశంలో ఎక్కడ లేని విధంగా గిగ్ వర్కర్ భద్రత కోసం ప్రత్యేక చర్యలు చేపట్టింది. మే డే రోజున చట్టం అమల్లోకి తీసుకొచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ మేరకు సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కార్మిక శాఖ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.