గతంలో రేవంత్ రెడ్డి టీడీపీని కాంగ్రెస్లో చేరిన విషయం తెలిసిందే. అప్పుడే ఆయన తన రాజీనామా లేఖను తనకు బీఫాం ఇచ్చిన టీడీపీ జాతీయ అధ్యక్ష్యుడు చంద్రబాబుకు అందచేశారు. అయితే ఆయన దానిని తెలంగాణా శాసనసభకు పంపక పోవడంతో రేవంత్ రాజీనామా విషయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం తెలంగాణ సీఎం కేసీఆర్ ముందస్తుకు సిద్ధమవుతోన్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి మరోసారి తన రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మాట్లో సమర్పించారు. అసెంబ్లీ రద్దుకు ముందే స్పీకర్ను కలిసి తన రాజీనామా లేఖను సమర్పించడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నించారు. ఇందుకోసం శాసనసభకు చేరుకున్న రేవంత్ రెడ్డి స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో రాజీనామా లేఖను ఆయన వ్యక్తిగత కార్యదర్శికి అందజేశారు. మధ్యాహ్నం తెలంగాణ క్యాబినెట్ భేటీ జరుగునుండగా ఈ సమయంలో రాజీనామా లేఖను సమర్పించడం ఇప్పుడు చర్చనీయంసం అయ్యింది.