Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
టీడీపీ కి వున్న ఫైర్ బ్రాండ్ నాయకుల్లో రేవంత్ రెడ్డి ముందు వరసలో వుంటారు. టీడీపీ అభిమానుల్లో రేవంత్ ని ప్రత్యేకంగా అభిమానించే క్యాడర్ ఉంటుంది. అలాంటి పార్టీని, క్యాడర్ ని వదిలిపెట్టి టీడీపీ కి రాజీనామా చేశారు రేవంత్ రెడ్డి. విదేశీ పర్యటన ముగించుకువచ్చిన చంద్రబాబు టీటీడీపీ నేతల్ని నేడు అమరావతికి పిలిపించుకున్న విషయం తెలిసిందే. ముందుగా పార్టీ సీనియర్ నేతలతో సమావేశం అయిన చంద్రబాబు రేవంత్ రెడ్డి విషయం మీద చర్చించారు. రేవంత్ దూకుడు, కాంగ్రెస్ అగ్రనేతలతో ఆయన భేటీ తదితర అంశాలపై బాబు విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశం తర్వాత రేవంత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి లతో బాబు సమావేశం కావాల్సి వుంది. చంద్రబాబు ఎప్పుడు పిలుస్తారా అని రేవంత్ ఎదురు చూస్తూ ఉండగానే ఆయన బయటికి వచ్చారు. భోజనానికి వెళుతూ కనిపించారు. దీంతో ఆయనకి రేవంత్ రెడ్డి ఓ నమస్కారం పెట్టారు.
చంద్రబాబు మళ్లీ వచ్చాక ఆయనతో రేవంత్ భేటీ అవుతారని అంతా అనుకున్నారు. కానీ జరిగింది వేరు. చంద్రబాబు అటు భోజనానికి వెళ్ళగానే రేవంత్ రెడ్డి బాబు పీఏ కి రాజీనామా లేఖ అందించారు. అక్కడినుంచి నేరుగా హైదరాబాద్ బయలుదేరారు. దీంతో రేవంత్ కి టీడీపీ తో వున్న బంధం తెగిపోయింది. ఇక ఆయన కాంగ్రెస్ లో ఎప్పుడు చేరేది తేలాల్సి వుంది. ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్ తో రేవంత్ చర్చలు ముగిసాయి. హైదరాబాద్ వచ్చాక రేవంత్ తాజా పరిణామాల మీద ప్రెస్ తో మాట్లాడే అవకాశం వుంది.