శైలజా రెడ్డి అల్లుడి మీద వీళ్ళు రివెంజ్ తీర్చుకున్నారా…?

Review Writers Revange In Sailajareddy Alludu

సినిమా హిట్టా ఫట్టా అనేది రివ్యూల మీద ఆధారపడి ఉంటుందా..? అంటే ఈ ప్రశ్న దర్శక నిర్మాతలకే కాదు రాస్తున్న రివ్యూ రైటర్లు కూడా సమాధానం చెప్పలేని ఓ ప్రశ్న. ఎందుకంటే బాగున్న సినిమాకి మంచి రివ్యూలే రాకపోయినా అన్ని రివ్యూలు నెగటివ్ గా వచ్చి ఆడియెన్స్ కు నచ్చితే ఆ సినిమా సూపర్ హిట్ అవుద్ది. ఇక బాగాలేని సినిమాకు బాగుందని రివ్యూ రాసినా జనాలు వచ్చి చూడరు. అయితే ఆల్రెడీ టాక్ బాగా రాని సినిమాకు రివ్యూస్ కూడా నెగటివ్ గా వస్తే కచ్చితంగా కలక్షన్స్ మీద ఆ ప్రభావం పడుతుంది. ఈ విషయం సినిమాల మీద కొద్దోగొప్పో అవగాహన ఉన్న అందరికీ బాగా తెలుసు.

sailaja-reddy-alludu
అందుకే రివ్యూస్ మీద, రివ్యూ రైటర్స్ మీద తమ అక్కసును తమ సినిమాల్లో, సినిమా ఆడియో, విజయోత్సవ ఫంక్షన్లలో చూపిస్తారు దర్శకులు( హీరోలు ఇందుకు మినహాయింపు కాదండోయ్ జూనియర్ ఎన్టీఆర్ సహా). వినాయక చవితి నాడు రిలీజ్ అయిన అయిన నాగ చైతన్య శైలజా రెడ్డి అల్లుడులో కూడా ఓ సీన్ లో జబర్దస్త్ క‌మెడియ‌న్ అడిగిన విష‌యానికి కాస్త ఎక్కువ‌గా స‌మాధానం ఇస్తుంటే నీకు మీడియా జ్ఞానం మ‌రీ ఎక్కువైపోయిందిరా వెళ్లి ఐమాక్స్ లో శుక్ర‌వారం సినిమాలు చూసి రివ్యూలు రాసుకో పో అంటూ సెటైర్ వేస్తాడు ర‌ఘుబాబు. ఇది కావాల‌ని వేయించిన సెటైర్. నీకు మీడియా నాలెడ్జ్ ఎక్కువైంది పోయి ప్రతి శుక్రవారం సినిమా చూసి రివ్యూలు రాసుకో అని రఘుబాబు తన దగ్గర స్టూడెంట్ ను అంటాడు. ప్రతి శుక్రవారం సినిమాలు చూసి రివ్యూలు రాసుకో అన్న డైలాగ్ కేవలం కామెడీ పండించేందుకే కాదు రివ్యూ రైటర్స్ మీద పంచ్ వేసేందుకు ఈ డైలాగ్ రాసి ఉంటాడని చెప్పొచ్చు. తన ప్రతి సినిమాకు కథ ఎలా ఉన్నా కామెడీ ఎంటర్టైనింగ్ మిస్ అవ్వని మారుతి శైలజా రెడ్డిలో అది మిస్ అయ్యాడు. సినిమా రొటీన్ కావడం అదే రోజున రిలీజ్ అయిన యూ టర్న్ సినిమా ఆసక్తి కరంగా ఉండడంతో ఈ సినిమా మీద తమ ప్రతాపాన్ని చూపించారు రివ్యూ రైటర్లు. మారుతి తమ మీద వేసిన పంచ్ కు వారు తమ తమ రాతల్లో చూపించారు. అయితే టాక్, రివ్య్యోలతో సంబంధం లేకుండా ఈ సినిమా కలెక్షన్ల పరంగా ముందుండడం మారుతికి కాస్త ఊపిరి తీసుకోదగ్గ విషయమే.

sailaja-reddy-movie