Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
శ్రీదేవి మృతిపై సోషల్ మీడియాలో మరియు వెబ్ మీడియాలో వస్తున్న విమర్శలు ఆమె అభిమానులను తీవ్రంగా కలిచి వేస్తోంది. అతిలోక సుందరిగా ఎంతో మంది అభిమానుల అభిమానంను చురగొన్న శ్రీదేవి మృతి పట్ల ఎన్నో పుకార్లు వస్తున్న నేపథ్యంలో సినీ ప్రముఖులు పలువురు ఆందోళన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇక వర్మను విపరీతంగా ఆరాధించే వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మీడియాలో వస్తున్న వార్తలపై ఘాటుగా స్పందించాడు. శ్రీదేవి గురించి ఇలాంటి వార్తలు వినాల్సి వస్తుందని తాను ఎప్పుడు భావించలేదని, ఇలా జరగడం దారుణం అంటూ వర్మ పేర్కొన్నాడు.
వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు శ్రీదేవిపై ఉన్న అభిమానం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శ్రీదేవి చనిపోయిన సమయంలో వర్మ చేసిన ట్వీట్స్ ఆయనలోని ఆవేదన తెలియజేశాయి. తాజాగా వర్మ మరోసారి శ్రీదేవి మరణంపై వస్తున్న పుకార్లపై స్పందించాడు. ఒక ప్రముఖ నటి మరణం గురించి ఇలాంటి వార్తలు మీడియాలో రాయడం ఏమాత్రం సరైనది కాదని, అది శ్రీదేవి గురించి ఇలా కథనాలు వినాల్సి వస్తుందని తాను ఎప్పుడు ఊహించుకోలేదు అంటూ వర్మ ఆవేదన వ్యక్తం చేశాడు. శ్రీదేవి మరణ వార్తలు ఇకపై అయినా మీడియా జనాలు వదిలేయాలని, చిన్న విషయాలను పెద్దగా చేసి ప్రచారం చేయవద్దని వర్మ మీడియాకు సూచించాడు. మీడియాలో వస్తున్న వార్తలు వర్మకు చాలా చిరాకు తెప్పించాయని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ప్రస్తుతం వర్మ ‘ఆఫీసర్’ అనే చిత్రాన్ని నాగార్జునతో చేస్తున్న విషయం తెల్సిందే.