Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రామ్ గోపాల్ వర్మ తాజాగా తెరకెక్కించిన షార్ట్ ఫిల్మ్ ‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్’ సంచలనాలకు మారు పేరుగా నిలిచిన విషయం తెల్సిందే. ఎన్నో వివాదాలు మరెన్నో విమర్శల నేపథ్యంలో వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించి విడుదల చేయడం జరిగింది. ఈ చిత్రాన్ని ఆన్‌లైన్‌లో ఈనెల 26న విడుదల చేసిన వర్మ భారీ ఎత్తున పబ్లిసిటీ చేశాడు. ఇండియాలో పోర్న్ అంటే తెలియని వారికి కూడా ఈ చిత్రం గురించి తెలిసేలా పబ్లిసిటీ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. తాను అనుకున్నది సాధించి తన జీఎస్టీకి భారీ ఎత్తున పబ్లిసిటీ దక్కించుకున్నాడు. వర్మ జీఎస్టీకి వచ్చిన పబ్లిసిటీతో భారీగా ఆయన ఖాతాలో డబ్బులు తెచ్చి పడేలా చేసింది.
యూరప్‌లో వర్మ పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో ఈ షార్ట్ ఫిల్మ్‌ను తెరకెక్కించిన విషయం తెల్సిందే. ఆన్‌లైన్‌లో ఈ చిత్రాన్ని చూడాలి అంటే 150 రూపాయలు చెల్లించాలి అంటూ వర్మ చార్జ్ పెట్టాడు. అయినా కూడా వర్మ అసలు పోర్న్ సినిమాను ఎలా తీశాడు అనే విషయాన్ని తెలుసుకోవాలని ఎక్కువ శాతం మంది ఆసక్తిని కనబర్చారు. మొదటి రోజే ఏకంగా మూడు లక్షల మంది ఆ వీడియోను చూసేందుకు సదరు ఆన్‌లైన్ పోర్టల్‌పై పడటంతో సైట్ ఒక్కసారిగా డౌన్ అయ్యింది. తర్వాత రోజున మళ్లీ సైట్‌ను అప్ గ్రేడ్ చేసి విడుదల చేయడం జరిగింది.
మొత్తంగా వర్మ ఇప్పటి వరకు 10 కోట్లకు పైగా ఈ చిత్రం ద్వారా సంపాదించినట్లుగా సినీ వర్గాల వారు అంటున్నారు. ఈ షార్ట్ ఫిల్మ్‌ను నిర్మించేందుకు వర్మకు 65 లక్షలు ఖర్చు అయ్యిందట. 40 లక్షలు మియా మాల్కోవాకు పారితోషికం ఇవ్వగా మిగిలినవి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరియు ఇతరత్ర ఖర్చులు అయినట్లుగా తెలుస్తోంది. అంటే మొత్తంగా వర్మకు 9 కోట్లకు పైగా లాభం వచ్చిందని లెక్కలు వేస్తున్నారు. ఇందుకే వర్మ జీఎస్టీ 2ను కూడా తీస్తానని అంటున్నాడేమో కదా..!