అర్జున్‌ రెడ్డికి వర్మ సపోర్ట్‌

rgv-supports-vijay-devarakonda-starrer-arjun-reddy-movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఇటీవల వరుసగా వివాదాల పాలు అవుతున్న ‘అర్జున్‌ రెడ్డి’ చిత్రంకు సంబంధించిన ముద్దు పోస్టర్‌ వివాదాన్ని రాజేస్తూనే ఉంది. ఇటీవల బస్సుపై ‘అర్జున్‌ రెడ్డి’ ముద్దు పోస్టర్‌ను తొలగించేందుకు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత విహెచ్‌ తీవ్ర ప్రయత్నాలు చేశాడు. ఇలాంటి పోస్టర్స్‌ వల్ల యువత చెడిపోతుందనే భావనను ఆయన వ్యక్తం చేశాడు. విహెచ్‌ చర్యపై స్పందిస్తూ హీరో విజయ్‌ దేవరకొండ సోషల్‌ మీడియాలో ‘తాతయ్య.. చిల్‌’ అంటూ వ్యంగ్యంగా పోస్ట్‌ చేశాడు. ఇప్పుడు అర్జున్‌ రెడ్డికి మద్దతుగా రామ్‌ గోపాల్‌ వర్మ కూడా విహెచ్‌పై విమర్శలు గుప్పించాడు. 

విహెచ్‌ ‘అర్జున్‌ రెడ్డి’ ముద్దు పోస్టర్‌ను చించేస్తున్నట్లుగా ఉన్న ఫొటోను వర్మ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసి.. మీరు, మీ పార్టీ తాతయ్య అయిపోయారు. ఇప్పుడు మీరు చేసే పిల్ల చేష్టలతో వచ్చే ఎన్నికల్లో రాబోయే ఎన్నికల్లో ప్రజలు మీకు ఓట్లు వేస్తారు అనుకుంటే పొరపాటే. మీ పార్టీ మీరు డబుల్‌ తాతయ్య అయ్యారు కనుక మనవళ్లు, మనవరాళ్లు మీ గురించి పట్టించుకోవడం లేదు. ‘అర్జున్‌ రెడ్డి’ సినిమా పోస్టర్‌లో ఏమైనా తప్పు ఉందేమో మీ మనవడు లేదా  మనవరాలిని అడిగి తెలుసుకోండి. ‘అర్జున్‌ రెడ్డి’ చిత్రం ఖచ్చితంగా మీలాంటి వారి కోసం కాదు, మీ మనవడు మనవరాలి వయస్సు ఉన్న వారికి కోసం. అంటే మీరు ఈ సినిమా గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటూ విహెచ్‌ తీరుపై దర్శకుడు వర్మ విమర్శలు సంధించాడు.

మరిన్ని వార్తలు:

మెగా ఫ్యామిలీతో రాజమౌళికి విబేధాలు లేవు

తెలుగు, తమిళంకు ఒక్కటే..!

స్పైడ‌ర్ లో బ్రిజేశ్ శాండల్య పాట‌