బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ల జోరు కొనసాగుతోంది. కుదురుకున్న రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ అర్ధశతకాలు పూర్తి చేసుకున్నారు. బంగ్లా బౌలింగ్‌ను ధాటిగా ఎదుర్కొంటూ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తున్నారు. ప్రపంచకప్‌లో ఓపెనింగ్ పవర్‌ప్లేలో భారత్ అత్యుత్తమ ప్రదర్శన చేసింది. వికెట్ నష్టపోకుండా అత్యధిక పవర్‌ప్లే స్కోరు 69/0 సాధించింది. సూపర్‌ఫామ్‌లో ఉన్న హిట్‌మ్యాన్ 45 బంతుల్లో 50 మార్క్ చేరుకున్నాడు. నిదానంగా ఆడుతూ రోహిత్‌కు సహకారం అందిస్తున్న రాహుల్ కూడా 57 బంతుల్లో హాఫ్‌సెంచరీ సాధించాడు. మెరుగైన రన్‌రేట్‌తో భారత్‌కు ఓపెనర్లు శుభారంభం అందించారు. 19 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా ఇండియా 117 పరుగులు చేసింది. రోహిత్(58), రాహుల్(55) జోడీ భారీ భాగస్వామ్యం నెలకొల్పే దిశగా దూసుకెళ్తోంది. ఈ జోడీని విడదేసేందుకు బంగ్లా బౌలర్లు తీవ్రంగా కష్టపడుతున్నారు.