జగన్ బదులుగా చక్రం తిప్పిన రోజా .

Roja celebrated national handloom day in Mangalagiri

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వైసీపీ లో అధినేత జగన్ తర్వాత స్థానం ఎవరిది అన్న ప్రశ్న వేస్తే ఎవరైనా నోరు వెళ్ళబెట్టాల్సి వస్తుంది. ఆయన భార్య భారతి, చెల్లెలు షర్మిల, తల్లి విజయమ్మ , బాబాయ్ సుబ్బారెడ్డి, సన్నిహితుడు విజయసాయి రెడ్డి…ఇలా జగన్ కి దగ్గరైన వారి పేర్లన్నీ కళ్ల ముందు మెదులుతాయి. వీరిలోఏ ఒక్కరి పేరు చెప్పినా మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే జగన్ నెంబర్ 1 అయితే వీరిలో ఎవరో ఒకరు నెంబర్ 2 అనుకోడానికి ఛాన్స్ లేకుండా పోయింది. మరి నెంబర్ 2 ఎవరనే కదా మీ డౌట్ ? దట్ ఈజ్ నాన్ అదర్ దెన్ రోజా. నమ్మడం లేదా ? మంగళగిరిలో జగన్ బదులు రోజా చక్రం తిప్పిన విషయం చూస్తే మీరే ఒప్పుకుంటారు. అసలు మ్యాటర్ ఏమిటంటే…

2019 ఎన్నికలకు సర్వసన్నద్ధం అయ్యేదిశగా జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా వైసీపీ మంగళగిరిలో ఓ సమావేశం ఏర్పాటు చేసింది. చేనేత సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే ఉద్దేశంతో తలపెట్టిన ఈ సభకి వైసీపీ అధినేత జగన్ ని ఆహ్వానించారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి. జగన్ కూడా ఈ సభకి రావడానికి ఒప్పుకోవడంతో భారీగా ఏర్పాట్లు కూడా చేశారు. అయితే నంద్యాల ఉపఎన్నికల ప్రచారంలో హడావిడిగా ఉండటంతో జగన్ ఈ సభకి రాకుండా హ్యాండ్ ఇచ్చాడు. దీంతో చేసిన హడావిడికి తగ్గట్టు ఎవరో ఒకరు పెద్దవాళ్ళని తీసుకురావాలి కాబట్టి ఎమ్మెల్యే ఆర్కే వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు రోజాని ఈ సభకి ఆహ్వానించాడు. ఆ రకంగా జగన్ ప్లేస్ లోకి వచ్చిన రోజా చరఖా చక్రం తిప్పేశారు. ఈ మొత్తం వ్యవహారాన్ని గమనించిన ఓ నేతన్న భలే డైలాగ్ కొట్టాడు. ” వైసీపీ లో జగన్ తర్వాత స్థానంలో రోజా వున్నారు ” అన్న ఆ నేతన్న డైలాగ్ తో రోజా రేంజ్ పెరిగిపోయింది.

మరిన్ని వార్తలు:

ఒక్క మాట.. రివర్స్ అయింది

తెలుగు రాష్ట్రాల నుంచి పదవులెవరికి..?

నేష‌న‌ల్ గానూ  బాల‌కృష్ణ బ‌ద‌నాం…