కొంతమంది ఆకతాయిలు ఆడవారిని ఎక్కడ పడితే అక్కడ వేధిస్తున్నారు దీని పై ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం షి టీం ద్వారా చాల మంది కి చెక్ పెట్టినప్పట్టికి, పలు చోట్ల ఇటువంటి సంఘటనలు పునరావృతం అవుతున్న ఉన్నాయి ముఖ్యం గా బస్ స్టాండ్ లో, బస్ లో, కాలేజీ లు దగ్గర జరుగుతున్నాయి. మరి ముఖ్యం గా రైల్వే స్టేషన్ లో ఇటువంటి చాలా ఎక్కువగా జరుగుతున్నాయి వీటిని అరికట్టడానికి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఒక నిర్ణయం తీసుకుంది. ఈ విషయాలకు సంబంధించి రైల్వే యాక్ట్ చర్యలు తీసుకోవాలని యోచిస్తోంది ఇంతకముందు ఇటు వంటి సంఘటనలు జరిగితే జీఆర్పీ పోలీస్ లు విచారణ చేసేవారు అయితే ఇప్పుడు ఆర్పీఫ్ పోలీస్ లు ఎప్పుడు ఈ విషయం లో కలగచేస్కునే వారు కాదు.
ట్రైన్ లో ఈవ్ టీజింగ్ లు కానీ, దొంగతనాలు జరిగిన ఆర్పీఫ్ పోలీసులు గవర్నమెంట్ పోలీసు కు అప్పచెప్పేవారు అయితే ఇకపై అలంటి అవకాశం లేకుండా రైల్వే అధికారులు కొత్త చట్టాన్ని తీసుకొని వొచ్చారు. ఈ చట్టం ప్రకారం ఎవరైనా ఆడవారిని వేధింపులకు గురి చేస్తే, చేసిన వారిని మూడు సంవత్సరాలు శిక్ష విధిస్తారు. ఇప్పటి వరుకు ఎవరైనా మొగవారు ఆడవారి కంపార్ట్మెంట్ లో ప్రయాణం చేస్తే 500 రూపాయలని జరిమానాయి విధిస్తు వొచ్చారు అయితే ఇప్పుడు దానిని 1000 కి పెంచడం ఆర్పీఫ్ కేంద్రానికి ప్రతిపాదించడం జరిగింది. అంతే కాకుండా నకిలీ ఏ టిక్కెటింగ్ ద్వారా మోసాలు పాల్పడే వారికీ కూడా ఈ చట్టాన్ని అమలు చేయాలనీ ప్రతిపాదించారు. ఈవ్ టీజింగ్ కి పాలుపడిన వారికీ మూడేళ్లు జైలు శిక్షతో పాటు 2 లక్షల రూపాయలు జరిమానా కూడా విధించాలని కోరారు.
రైళ్లలో ఆడవారిపై గత 10 సంవత్సరాలు గా అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి, కొద్ది నెలల క్రితం రైలు లో ప్రయాణిస్తున్న అమ్మాయి పై 3 యువకులు పాశవికంగా దాడి చేసిన విషయం తెలిసిందే అయితే ఇటువంటి సంఘటనలకు సంబంధించి రాజ్యసభలో రైల్వే మంత్రిత్వ శాఖ ప్రస్తావన కూడా తీసుకొచ్చింది. ఇలాంటి కేసుల 2014-16 మధ్య కాలంలో సంఖ్య 35 శాతం పెరిగిందని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారు . మహిళా ప్రయాణికులపై జరిగిన లైంగిక దాడులకు సంబంధించి 2014 నుండి 2016 కి గాను మొత్తం 1607 కేసులు నమోదైనట్లు తెలిపింది.