Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మయన్మార్ కు చెందిన రోహింగ్యా ముస్లింలకు భారత్ ఆశ్రయమిస్తుండటంపై దేశంలో భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. కొందరు సానుభూతి చూపిస్తుండగా… ఆరెస్సెస్, వీహెచ్ పీ వంటి సంస్థలు రోహింగ్యాల అక్రమ ప్రవేశాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. శాంతియుతంగా ఉండే మయన్మార్ నుంచి రోహింగ్యాలు రావాల్సిన అవసరం లేదని వారు వాదిస్తున్నారు. తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసే వీహెచ్ పీ నాయకురాలు సాధ్వి ప్రాచి తాజాగా రోహింగ్యాలను ఉగ్రవాదులకంటే ప్రమాదకరమైన వారని ఆరోపించారు.
ఇప్పటికే 40 వేల మంది రోహింగ్యా ముస్లింలు భారత్ లోకి ప్రవేశించారని, వారిలో దాదాపు 15వేలమంది జమ్మూకాశ్మీర్ లో ఉన్నారని ఆమె తెలిపారు. రోహింగ్యాలు ఐఎస్ఐ ఉగ్రవాదుల కంటే ప్రమాదకరమైనవారని, వారి అక్రమ చొరబాటుతో భారత్ లో ఉగ్రవాదం పెరిగే ప్రమాదముందని సాధ్వి హెచ్చరించారు. రోహింగ్యాలకు ఆశ్రయమిచ్చేందుకు ముస్లిం దేశాలు కూడా ముందుకు రావటం లేదని, భారత్ ఎందుకు ఆశ్రయం ఇవ్వాలని ఆమె ప్రశ్నించారు. వారికి ఆశ్రయం ఇవ్వటానికి భారత్ ధర్మశాలేమీ కాదని వ్యాఖ్యానించారు.
మయన్మార్ లో మెజార్టీ ప్రజలైన బౌద్ధులు శాంతికాముకలని, అలాంటి వారిపై రోహింగ్యాలు హింసకు పాల్పడుతున్నారని సాధ్వి ఆరోపించారు. వారిని వెంటనే భారత్ నుంచి తరిమివేయాలని డిమాండ్ చేశారు. మయన్మార్ లో మైనార్టీలుగా ఉన్న రోహింగ్యా ముస్లింలకు, మెజార్టీలైన బౌద్దులకు మధ్య కొన్నేళ్లుగా ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రోహింగ్యాలు భారత్ కు వలస వస్తున్నారు.
మరిన్ని వార్తలు: