ఎన్టీఆర్‌కు అదుర్స్‌.. తేజూకు ఇది

Sai Dharam Tej Movie With Vv Vinayak Confirmed

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఎన్టీఆర్‌ కెరీర్‌లో ‘అదుర్స్‌’ సినిమా ఎంత సక్సెస్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమాలో ఎన్టీఆర్‌ ద్విపాత్రాభినయం చేసి మెప్పించాడు. ముఖ్యంగా అయ్యగారి పాత్రలో ఎన్టీఆర్‌ కనబర్చిన నటన ఆయన కెరీర్‌లోనే ది బెస్ట్‌గా నిలిచింది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆ సినిమాకు వివి వినాయక్‌ దర్శకత్వం వహించాడు. ఆ సినిమా తర్వాత రామ్‌ చరణ్‌ హీరోగా ‘నాయక్‌’ చిత్రాన్ని వినాయక్‌ తెరకెక్కించాడు. నాయక్‌లో రామ్‌ చరణ్‌ డబుల్‌ రోల్‌లో నటించాడు. ఇక తాజాగా చిరంజీవి ‘ఖైదీ నెం.150’ చిత్రాన్ని వివి వినాయక్‌ తెరకెక్కించాడు. ఆ సినిమాలో కూడా చిరు ద్విపాత్రాభినయం చేసిన విషయం తెల్సిందే. ఇప్పుడు సాయి ధరమ్‌ తేజ్‌తో వివి వినాయక్‌ ఒక సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. 

ఇటీవలే లాంచనంగా ఆ సినిమా పట్టాలెక్కింది. దాదాపు ఆరు నెల సమయం తీసుకున్న తర్వాత వివి వినాయక్‌ ఈ చిత్రాన్ని మొదలు పెట్టాడు.భారీ స్థాయిలో అంచనాలున్న ఈ సినిమా తేజూకు స్టార్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకుంటుందనే నమ్మకంతో మెగా ఫ్యాన్స్‌ ఉన్నారు. ఈ సినిమాలో తేజూ డబుల్‌ రోల్‌లో కనిపించబోతున్నాడు. డబుల్‌ రోల్‌ సినిమాలను ఇప్పటి వరకు బాగా డీల్‌ చేసిన వివి వినాయక్‌ ఈ సినిమాను కూడా తప్పకుండా ఆకట్టుకునే విధంగా తెరకెక్కిస్తాడనే నమ్మకంతో సినీ వర్గాల వారు ఉన్నారు. తేజూ కెరీర్‌లో ఈ సినిమా ఎన్టీఆర్‌ ‘అదుర్స్‌’లా మిగిలి పోవడం ఖాయం అంటున్నారు.

మరిన్ని వార్తలు:

బాహుబ‌లి త‌ర్వాత భ‌ర‌త్ అను నేను

మెగా ఫ్యాన్స్‌లో గందరగోళం