‘ఫిదా’ బ్యూటీ తీరుపై విమర్శలు

Sai Pallavi Behavior on sets

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
మలయాళ ‘ప్రేమమ్‌’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి ఆ సినిమా కారణంగా తెలుగులో ‘ఫిదా’ చిత్రంలో హీరోయిన్‌గా ఎంపిక అయ్యింది. మొదటి సినిమాతోనే స్టార్‌ హీరోయిన్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న సాయి పల్లవి ప్రస్తుతం నానికి జోడీగా ‘ఎంసీఏ’ అనే చిత్రంలో నటిస్తోంది. దిల్‌రాజు బ్యానర్‌లో ఎంసీఏ చిత్రం తెరకెక్కిన విషయం తెల్సిందే. ఈ చిత్రం షూటింగ్‌ సమయంలో నానికి సాయి పల్లవికి మద్య విభేదాలు తలెత్తాయి అంటూ వార్తలు వచ్చాయి. ఆ వార్తలు నిజం కాదని మొదట కొట్టి పారేసిన చిత్ర యూనిట్‌ సభ్యులు ఆ చిత్రం షూటింగ్‌ పూర్తి అయిన తర్వాత ఆ వార్తలు నిజమే అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

సాయి పల్లవి తీరుపై ‘ఎంసీఏ’ చిత్ర యూనిట్‌ సభ్యులు విమర్శలు చేస్తున్నారు. కొత్త హీరోయిన్‌ అనే విషయాన్ని మర్చి పోయి తానో స్టార్‌ హీరోయిన్‌, సీనియర్‌ హీరోయిన్‌ అన్నట్లుగా సాయి పల్లవి ప్రవర్తిస్తుందని, ఆమె పెద్ద వారు, సీనియర్లు అనే గౌరవం లేకుండా అందరిని ఒకేలా ట్రీట్‌ చేస్తూ మాట్లాడుతూ ఉండేదట. దర్శకుడికే కొన్ని సార్లు సలహాలు ఇచ్చేందని, దర్శకుడి పనిలో వేలు పెడుతున్న సమయంలోనే సాయి పల్లవిని నాని మందలించడం, దాంతో వివాదం జరగడం అయ్యిందని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. సాయి పల్లవి ఒకటి రెండు సార్లు దిల్‌రాజును కూడా ఇబ్బంది పెట్టేలా చేసిందని, ఆమె దిల్‌రాజు నిర్మించేందుకు ప్రయత్నిస్తున్న ‘శ్రీనివాసకళ్యాణం’ చిత్రంలో హీరోయిన్‌గా బుక్‌ అయ్యి, ఆ తర్వాత కథ బాగాలేదు అంటూ తప్పుకుందని, ఇలా పలు కారణాలు చూపుతూ సాయి పల్లవిపై సినీ వర్గాల వారు ముఖ్యంగా దిల్‌రాజు క్యాంప్‌ విమర్శలు ఎక్కు పెడుతున్నారు. ఇలాగే సాయి పల్లవి కొనసాగితే ఆమె కెరీర్‌లో తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుందని కొందరు హెచ్చరిస్తున్నారు.