ఇది వర్కౌట్‌ అయితే సంచలనమే

Praveen Sattaru multi starrer fixed

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

జాతీయ అవార్డు గ్రహీత ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో ఇటీవలే వచ్చిన ‘గరుడవేగ’ చిత్రం మంచి సక్సెస్‌ను అందుకుంది. చాలా సంవత్సరాల తర్వాత రాజశేఖర్‌కు గరుడవేగ చిత్రం విజయాన్ని దక్కించి పెట్టింది. పది కోట్ల బడ్జెట్‌తో చేయాలని భావించిన చిత్రాన్ని ఏకంగా 25 కోట్ల బడ్జెట్‌ పెంచాడు అంటూ దర్శకుడు ప్రవీణ్‌పై విమర్శలు వచ్చాయి. ప్రవీణ్‌ పిచ్చి పని వల్ల నిర్మాత భారీగా నష్టపోబోతున్నాడు అంటూ అంతా అన్నారు. అయితే గరుడవేగ సక్సెస్‌తో నిర్మాత సేఫ్‌ అవ్వడంతో పాటు భారీగా లాభాలను దక్కించుకోవడం జరిగింది. ఇప్పుడు అదే దర్శకుడు ఒక మల్టీస్టారర్‌ చిత్రాన్ని చేసేందుకు స్క్రిప్ట్‌ను సిద్దం చేశాడు.

మల్టీస్టారర్‌ అంటే ఇద్దరు హీరోలు కాదు, ఏకంగా ముగ్గురు హీరోలతో ప్రవీణ్‌ మల్టీస్టారర్‌ చేసేందుకు సిద్దం అవుతున్నాడు. ఒక విభిన్నమైన కథను దర్శకుడు ప్రవీణ్‌ సత్తారు రెడీ చేయడం, ఆ కథను నితిన్‌ మరియు రానాలకు వినిపించడంతో వారు థ్రిల్‌ అయ్యి వెంటనే నటించేందుకు ఓకే చెప్పారట. ఇక మూడవ హీరోగా నారా రోహిత్‌ను సంప్రదించే అవకాశం ఉంది. ఆయన కూడా త్వరలోనే ఓకే చెప్తాడు అనే నమ్మకంతో దర్శకుడు ప్రవీణ్‌ ఉన్నాడు. ముగ్గురు యువ హీరోలతో మల్టీస్టారర్‌ చిత్రం అంటే మామూలుగా ఉండదు. ఇదో సంచలన చిత్రంగా నిలుస్తుందని సినీ వర్గాల వారు కూడా భావిస్తున్నారు. ఈ చిత్రంపై పూర్తి క్లారిటీ జనవరిలో రానుంది.