Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సాక్షి రంగంలోకి దిగాక అప్పటికే దిగజారిన పాత్రికేయ విలువలు మరీ పాతాళంలోకి పడిపోయాయి. ఆ పత్రిక జగన్ భజన చేయడానికి, ఆయన రాజకీయ ప్రత్యర్థుల పని పట్టడానికి అన్ని హద్దులు దాటేసింది. ఇప్పుడు జగన్ పాదయాత్ర సందర్భంగా సాక్షి పైత్యం పెరిగిపోయింది. ఇటీవల జగన్ పాదయత్రని హైలైట్ చేయడానికి సాక్షి రాసిన ఓ కధనం చూస్తే జగన్ మీద గౌరవం పెరిగే మాట అటుంచి పొట్ట చెక్కలు అయ్యేలా నవ్వుకునే పరిస్థితి వచ్చింది. ఇంతకీ సాక్షి రాసిన ఆ కధనం లో మచ్చుకు కొంత పాండిత్యం మీ కోసం.
“ పుట్టింటికి ఆడపడుచులు “ అన్న శీర్షికతో కర్నూల్ జిల్లా ఎర్రగుంట్ల పాదయాత్ర సందర్భంగా సాక్షి రెచ్చిపోయింది. ఇక ఆ కధనంలో కొన్ని లైన్స్ చదువుకుని మనసారా నవ్వుకోండి. “ జగన్ పాదయాత్ర జరిగిన గ్రామాల్లో జనం కొత్త దుస్తులు వేసుకున్నారు. పురుషులు కొత్త పంచెలు, మహిళలు పట్టు చీరలు ధరించి పాదయాత్రకు వచ్చారు. బతుకు తెరువు కోసం ఇతర ప్రాంతాలకు వలస పోయినవారు , వివాహం అయి అత్తారిళ్లకు వెళ్ళినవాళ్ళు పాదయాత్ర చేస్తున్న జగన్ ని చూసేందుకు సొంత గ్రామాలకు తరలిరావడం గమనార్హం. మా ఊరికి జగన్ మోహన్ రెడ్డి వస్తున్నారు. ఆయన్ని చూసేందుకు ,పాదయాత్రలో పాల్హోనేందుకు మా కూతురు , అల్లుడు ఉద్యోగాలకు సెలవు పెట్టి మరీ వచ్చారు… ఇలా సాగింది సాక్షి కధనం. పల్లెల్లో ఏదైనా గ్రామ దేవతల జాతరలు జరిగినప్పుడో, పండగలప్పుడో కనిపించే వాతావరణాన్ని జగన్ పాదయాత్రకు అన్వయించి సాక్షి రాసిన కధనం చూసాక జగన్ తనను తాను దేవుడు అనుకుంటే తప్పేముంది.