బాబోయ్‌.. 200 కోట్ల నష్టమా?

Salman Khan's 'Tubelight' movie has got to loss 200 crores

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Salman Khan’s ‘Tubelight’ Movie Has Got To Loss 200 Crores

సల్మాన్‌ ఖాన్‌ గత కొన్ని సంవత్సరాలుగా వరుస విజయాలను సొంతం చేసుకుంటూ వస్తున్నాడు. ఈ మద్య కాలంలో సల్మాన్‌ నటించిన ప్రతి సినిమా కూడా 250 కోట్లకు పైగా వసూళ్లను సాధించాయి. దాంతో ఆయన తాజాగా నటించిన ‘ట్యూబ్‌లైట్‌’ చిత్రంపై కూడా అంచనాలు భారీగా పెరిగాయి. పైగా ఈ సినిమా ఇండియా బోర్డర్‌లో తెరకెక్కడంతో పాటు ఆకట్టుకునే అంశాలు పలు ఉన్నాయంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రచారం చేశారు. దాంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగి డిస్ట్రిబ్యూటర్‌లు సినిమాను భారీ మొత్తాలకు కొనుగోలు చేయడం జరిగింది. 

ఈ చిత్రం సునాయాసంగా 400 కోట్లను క్రాస్‌ చేస్తుందనే ఉద్దేశ్యంతో అన్ని ఏరియాల్లో కలిపి 400 కోట్ల బిజినెస్‌ జరిగింది. ఇప్పటి వరకు సల్మాన్‌ ఖాన్‌ నటించిన చిత్రాల్లో ఇదే అత్యధికంగా చెప్పుకోవచ్చు. రెండు వందలు ఆపై మాత్రమే సల్మాన్‌ ఖాన్‌ మార్కెట్‌ ఉండేది. కాని ట్యూబ్‌లైట్‌పై వచ్చిన అంచనాల కారణంగా సినిమాను ఏకంగా 400 కోట్లకు అమ్మేశారు. అయితే ఈ సినిమా వసూళ్లు చేసింది కేవలం 150 కోట్లు మాత్రమే. లాంగ్‌ రన్‌లో మరో 50 కోట్లు వస్తే రావచ్చు. అంటే మొత్తంగా రెండు వందల కోట్లు మాత్రమే సినిమా వసూళ్లు చేస్తుంది. అంటే డిస్ట్రిబ్యూటర్లు ఏకంగా 200 కోట్లు లాస్‌ అయ్యే పరిస్థితి వచ్చింది. నిర్మాత మాత్రం ముందే సేఫ్‌ అయ్యాడు.

మరిన్ని వార్తలు