Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
చిన్నప్పుడు తన తల్లితో కలిసి చర్చికి వెళ్లిన మధుర జ్ఞాపకాలను ట్విట్టర్ లో గుర్తుచేసుకుంది అక్కినేని సమంత. తన తల్లి నినెట్ ప్రభు బలవంతం మీద చర్చికి వెళ్లేదాన్నని ఆమె ట్విట్టర్ లో పాత సంగతులను షేర్ చేసుకుంది. మా అమ్మ చర్చికి బలవంతంగా లాక్కెళ్లిన రోజులు గుర్తొచ్చాయి. వారంలో మూడు రోజులు… బుధవారం, శనివారం, ఆదివారం తీసుకెళ్లేది. అప్పుడది అస్సలు నచ్చేదికాదు. కానీ ఆమె ప్రార్థనలే నన్ను రక్షించాయి. నా అద్భుతమైన అమ్మ. అని సమంత ట్వీట్ చేసింది. దీంతో పాటు చర్చిముందు తాను దిగిన ఫొటోను పోస్ట్ చేసింది.
క్రిస్టియన్ వర్గానికి చెందిన సమంత ఆ మత విశ్వాసాలను పాటిస్తుంది. నాగచైతన్యను హిందూ సంప్రదాయంతో పాటు క్రిస్టియన్ పద్ధతిలోనూ పెళ్లాడింది. నిజానికి సమంత, చైతన్య పెళ్లిముందు సమంతతో నాగార్జున కుటుంబం మతమార్పిడి చేయించినట్టు వార్తలొచ్చాయి. చైతన్యను క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లాడడం, వివాహం తరువాత కూడా తన మత సాంప్రదాయాలను పాటించడం చూస్తే అత్తగారింట్లో సమంత మత విశ్వాసాలపై ఎలాంటి అభ్యంతరం లేదని అర్ధమవుతోంది.