కన్నడంలో తెరకెక్కి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ‘యూటర్న్’ చిత్రంను సమంత రెండు సంవత్సరాలు కలలు కని, ఈమద్య చేసిన విషయం తెల్సిందే. తెలుగు మరియు తమిళంలో రూపొందిన ‘యూటర్న్’ చిత్రంకు విమర్శకుల ప్రశంసలు అయితే దక్కాయి కాని కమర్షియల్‌గా ఈ చిత్రం అంతగా వసూళ్లను రాబట్టలేక పోయింది అంటూ ప్రచారం జరిగింది. అయితే సినిమా ప్రపంచ వ్యాప్తంగా 23 కోట్ల గ్రాస్‌ను వసూళ్లు చేసింది అంటూ చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
ఒక హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రం, అదీ ఒక హర్రర్ చిత్రం ఇంత భారీగా వసూళ్లు చేయడం అంటే మామూలు విషయం కాదు. తెలుగుతో పాటు తమిళంలో కూడా మంచి వసూళ్లను ఈ చిత్రం రాబట్టినట్లుగా దీన్ని బట్టి అర్థం అవుతుంది. 23 కోట్ల గ్రాస్ అంటే 10 కోట్లకు పైగా షేర్ దక్కినట్లే అని చెప్పుకోవచ్చు. ఏడు ఎనిమిది కోట్ల లోపు బడ్జెట్‌తో ఈ చిత్రం రూపొంది ఉంటుందని తెలుస్తోంది. నిర్మాతలకు అన్ని రైట్స్‌తో 10 కోట్లకు పైగా లాభం వచ్చి ఉంటుందని, ఈ చిత్రంతో సమంతకు నాలుగు కోట్ల పారితోషికం దక్కింది అంటూ సమాచారం అందుతుంది. మొత్తానికి సమంత బాగానే రాబట్టింది అంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది.