అక్కినేని ఫ్యామిలీలో అడుగు పెట్టిన సమంత మెల్ల మెల్లగా సినిమాలను తగ్గిస్తుంది. నాగచైతన్యను వివాహం చేసుకున్న తర్వాత కూడా సినిమాల్లో కంటిన్యూ అవుతాను అంటూ గతంలో ప్రకటించిన సమంత ఈమద్య కొత్త సినిమాలను కమిట్ కాకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ట్విట్టర్‌లో సమంత అభిమానులతో కొంత సమయం చిట్ చాట్ చేసింది. ఈ సందర్బంగా పలువురు అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమంత ఓపికతో సమాధానం చెప్పింది.
ఈ సందర్బంగా ఒక అభిమాని పెళ్లిలో మీకు నాగార్జున గారు ఇచ్చిన బహుమానం ఏంటీ అంటూ ప్రశ్నించారు. అందుకు సమంత గడుసుగా నాకు మామయ్య పెద్ద గిఫ్ట్ ఇచ్చారు. ఆయన చైతూతో నా పెళ్లి ఒప్పుకోవడమే నాకు అన్నింటి కంటే పెద్ద గిఫ్ట్. అందుకు మించిన గిఫ్ట్ తనకు ఇంకేం అవసరం లేదన్నట్లుగా చెప్పుకొచ్చింది. ఇక పెళ్లి తర్వాత సినిమాలను ఒప్పుకోక పోవడం వెనుక కారణం ఏంటీ అంటూ ప్రశ్నించిన సమయంలో సినిమాలను ఒప్పుకోక పోవడం ఏమీ లేదని, కొత్త సినిమాలను త్వరలోనే ప్రకటిస్తాను అంటూ చెప్పుకొచ్చింది. తాజాగా తాను యూటర్న్‌ను పూర్తి చేశాను అని, తాజాగా చైతూతో కలిసి ఒక చిత్రాన్ని చేయబోతున్నాను అని, కొత్త సినిమాలు కూడా ఇంకా ఉన్నాయి అంటూ అభిమానులకు చెప్పుకొచ్చింది.