టీడీపీని వదిలి టీఆర్ఎస్‌లోకి వస్తే 25కోట్లు…!

Sandra Venkata Veeraiah Controversy Comments On Trs Party

తెలంగాణ సీఎం నిరంతరం రాజకీయ బేరసారాలకు పాల్పడుతూ ప్రభుత్వ యంత్రాంగంతో పాటు, సొంతంగా ఏర్పాటుచేసుకున్న మీడియా సంస్థల ద్వారా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా అసత్యపూరితమైన సమాచారాన్ని ప్రసారం చేస్తూ ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నం చేశారు. ఎన్నో ఆశలతో, ఆకాంక్షలతో తెలంగాణ ప్రజలు కేసీఆర్‌కు పట్టం కట్టారు. బంగారు తెలంగాణ స్వప్నాన్ని విస్మరించి తన రాజకీయ లబ్ధికోసం కేసీఆర్‌ పాకులాడుతున్నారు. ప్రతిపక్ష పార్టీల నేతలను ఫిరాయింపులకు ప్రోత్సహిస్తూ, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. ప్రజాసమస్యలను గాలికొదిలేస్తున్నారు. తన వాక్చాతుర్యంతో ప్రజల్ని మభ్యపెడుతున్నారు. ఏడాది కాలంగా కేసీఆర్‌ చేసింది శూన్యం. తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు సమస్యలను సృష్టించడం ఆయనకు కొత్తేమీ కాదు. కేసీఆర్‌ ఆటలు కలకాలం సాగవు. ఇది వోటుకు నోటు కేసు గురించి ప్రస్తావిస్తూ అప్పటి టీడీపీ ఇప్పటి టీఆర్ఎస్ ఏమ్మేల్యే అదే మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాద్ చేసిన వ్యాఖ్యలు. ఆ తర్వాత ఆయన కూడా పార్టీ మార్చేశాడు అనుకోండి అది వేరే విషయం. కానీ ఇప్పుడు టీడీపీ పరిస్థితి చూస్తే టీఆర్ఎస్ కే భయం పుడుతోంది.

tdp-party

2014 ఎన్నికల అనంతరం పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు అందరూ టీడీపీని వీడినా ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గ తాజా మాజీ ఎమ్మెల్యే సండ్ర మాత్రం పార్టీనే నమ్ముకొని ఉన్నారు. ఇప్పటికే సత్తుపల్లిలో వరుసగా రెండుసార్లు విజయం సాధించిన సండ్ర ముచ్చటగా మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు. దానికి తగ్గట్టే ఆయన ప్రచారంలో దూసుకుపోతున్నారు. తాజాగా వేంసూరు మండలం భీమవరం, లచ్చన్నగూడెం, మర్లపాడు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా భీమవరంలో సండ్ర మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీని వదిలి తమ పార్టీలోకి వస్తే రూ.25కోట్లు ఇస్తామన్నారు. డబ్బు ఆశ చూపి పార్టీ మారాలని ఒత్తిడి తీసుకొచ్చినా, అక్రమ కేసుల్లో ఇరికించినా ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పార్టీ వీడకుండా సత్తుపల్లి నియోజకవర్గ అభివృద్దే ధ్యేయంగా, ప్రజలే దేవుళ్లుగా భావించి అభివృద్ధి చేస్తున్నానన్నారు. రాష్ట్రంలో జలగం వెంగళరావు, ఎన్టీ.రామారావు, వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి, చంద్రబాబులను ఆదర్శంగా తీసుకుని ప్రాంతాభివృద్దికి కృషి చేస్తున్నానన్నారు. ప్రజాకూటమి అధికారంలోకి వస్తే మేనిఫెస్టోలో పొందుపరచిన అంశాలతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. తనను మరోసారి సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించాలని సండ్ర కోరారు.

tdp-trs-party