Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తమిళంలో విజయ్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మెర్సల్’. ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయ్ అద్బుతమైన నటనతో పాటు, కొన్ని ఆకట్టుకునే డైలాగ్స్‌తో సినిమా తమిళ ఆడియన్స్‌కు తెగ నచ్చేసింది. సినిమాలో ఉన్న జీఎస్టీ వ్యతిరేక డైలాగ్‌లతో సినిమాకు భారీ పబ్లిసిటీ దక్కింది. జీఎస్టీని వ్యతిరేకించే ఆ డైలాగ్స్‌ను తొలగించాలంటూ బీజేపీ నాయకులు తమిళనాడు వ్యాప్తంగా ఆందోళనలు చేసిన విషయం తెల్సిందే. బీజేపీ నాయకుల ఆందోళనకు తలొగ్గిన నిర్మాత ఆ డైలాగ్స్‌ను తొలగిస్తున్నట్లుగా ప్రకటించాడు. ఇప్పుడు ‘మెర్సల్’ చిత్రం తెలుగులో ‘అదిరింది’ అనే టైటిల్‌తో వచ్చింది.
తెలుగు వర్షన్లో జీఎస్టీ వ్యతిరేక డైలాగ్స్‌ను ఉంచాలని నిర్మాత శరత్ మరార్ భావించాడు. కాని సెన్సార్ బోర్డు మాత్రం ఆ డైలాగ్స్‌ను తొలగిస్తేనే సెన్సార్ సర్టిఫికెట్ ఇస్తామని చెప్పడంతో నిర్మాత చివరి నిమిషంలో ఆ డైలాగ్స్‌ను తొలగించేందుకు ఓకే చెప్పి సెన్సార్ చేయించాడు. తెలుగు ప్రేక్షకుల ముందుకు ఆ డైలాగ్స్ లేకుండానే అదిరింది చిత్రం రాబోతుంది. ఈ చిత్రంలో విజయ్‌కు జోడీగా సమంత నటించడంతో తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. సమంతతో పాటు కాజల్ మరియు నిత్యామీనన్‌లు కూడా ఈ చిత్రంలో ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు.
తమిళంలో మొదటి వారంలోనే 170 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రంపై తెలుగులో కూడా భారీ ఆసక్తి ఉంది. ఇప్పటి వరకు తెలుగులో సక్సెస్‌లు దక్కించుకోలేక పోయిన విజయ్ ఈ చిత్రంతో మొదటి సారి తెలుగు బాక్సాఫీస్ వద్ద సందడి చేయబోతున్నాడు అంటూ ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుందని చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు.