టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్‌ను ఇప్పటి వరకు సాఫ్ట్ అండ్ గ్లామరస్ పాత్రల్లోనే చూశాం. కానీ తొలిసారిగా ఈ బ్యూటీ లేడి ఓరియెంటెడ్ సినిమా లో నటిస్తోంది. ఈ సినిమాయే సత్యభామ. ఈ చిత్రంలో కాజల్ తన వైలెన్స్‌తో ప్రేక్షకులను ఫిదా చేసింది. ఇంత వైలెంట్‌గా కనిపిస్తుంది మన చందమామనేనా అని ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారంటే అతిశయోక్తి కాదు. ఇక తాజాగా ఈ చిత్రబృందం ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేసింది. ఫుల్ ఆన్ యాక్షన్ మోడ్‌లో కాజల్ అదరగొట్టింది. ఒక అమ్మాయి మర్డర్ కేసును ఛేదించే క్రమంలో సత్యభామ(కాజల్) ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి? అనే ఆసక్తికర కోణంలో ఈ సినిమా రూపొందించినట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది.
హత్యకు గురైన ఒక అమ్మాయి ప్రాణాలు కాపాడాలని ట్రై చేస్తున్న సమయంలో ఆ అమ్మాయి చనిపోతుంది. ఆ యువతి మరణం సత్యభామను బాగా కుంగదీస్తుంది. దీంతో ఆమెను హత్య చేసిన హంతకుల కోసం వేట మొదలుపెడుతుంది. ఈ వేటలో తన దారికి అడ్డొచ్చిన విలన్లను సత్యభామ చితక్కొడుతుంది. అలా ఈ టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంది .. ఫుల్ యాక్షన్ సీక్వెన్సులతో సాగిపోయింది. ఇంకెందుకు ఆలస్యం మీరూ ఒక లుక్కేయండి మరి.
Video : https://youtu.be/Bx7TJD5XUBw