విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులే కంచే చేనుమేస్తున్న చందంగా విద్యార్థినిలను చెరబడుతున్న ఉదంతాలు ఇటీవలి కాలంలో ఎక్కువగా వెలుగు చూస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రేమపేరుతో ఒక బాలికను వివాహమాడి ఆ తరువాత పత్తాలేకుండా పోయిన ఒక కీచక ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్టు చేసి కటకటాల వెనక్కినెట్టారు.
పోలీసుల వివరాల ప్రకారం యర్రగొండపాలెం మండలం చినరాయనిపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న డి. భానుప్రకాశం సింగరాకొండ మండలం పాకలకు చెందిన ఒక బాలిక మీద ప్రేమ నటిస్తూ వశపరుచుకున్నాడు. తరువాత ఆమె బలవంత పెట్టడంతో విజయవాడ వెళ్లి ఒక ప్రార్థనా మందిరంలో ఉంగరాలు మార్చుకుని పెళ్లి చేసుకున్నారు. కొద్దిరోజులు ఆమెతో ఉన్న ఆయన ఆ తర్వాత చెప్పాపెట్టకుండా వెళ్లిపోయాడు. భానుప్రకాశం ఫోన్లో కూడా అందుబాటులో లేకపోవడంతో అతనిపై బాలిక తల్లిదండ్రులు సింగరాయకొండ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు భానుప్రకాశంను అరెస్టు చేశారు.