ముద్రగడ ఇంట్లో కాపు జేఏసీ రహస్య భేటీ…మద్దతు ఆ పార్టీకే !

Secret meeting of Kapu JAC

గత కొద్ది రోజుల క్రితం కాపులకి నిధులు అయితే ఎక్కువ ఇస్తామని , కానీ రిజేర్వేషన్ల అంశం కేంద్రం పరిధిలోని అంశం కాబట్టి హామీ ఇవ్వలేనని ప్రకటించిన జగన్ రెంద్రోజుల్లోనే తన తప్పు తెలుసుకుని వెంటనే తన మాటలు వక్రీకరించారని కాపులకి అండగా ఉంటానని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే అంతే వేగంగా వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేసిన ప్ర‌క‌ట‌న‌పై ముద్ర‌గ‌డ నిప్పులు చెరిగారు. జ‌గ‌న్ కాపుల‌ను మోసం చేశారంటూ ఆయ‌న విరుచుకుప‌డ్డారు. కాపు ఉద్య‌మం పుట్టిన జిల్లాలోనే జ‌గ‌న్ కాపు జాతిని అవ‌మానించార‌ని కాపుల రిజ‌ర్వేన్ల‌పై చంద్ర‌బాబును తాను న‌మ్ముతున్నానంటూ ఆయ‌న ప్రకటించారు.

దీంతో ముద్రగడ తెలుగుదేశం వంక చూస్తున్నారని ప్రస్తుతం రాజకీయ నిరుద్యోగిగా ఉన్న ఆయన్ని తెలుగుదేశం దారిలోకి తెచ్చుకోవాలని చూస్తోందని వార్తలు వచ్చాయి. ఈ తరుణంలో అన్ని జిల్లాల జేఏసీ నేతలతో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గురువారం రహస్య సమావేశాన్ని నిర్వహించారు. కిర్లంపూడిలోని ముద్రగడ నివాసంలో నిర్వహించిన ఈ సమావేశంలో ఉభయ గోదావరి జిల్లాల నేతలతో పాటు, విశాఖ, శ్రీకాకుళం, విజయంనగరానికి చెందిన కాపు నేతలు పాల్గొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ముందస్తుగా ఏ రాజకీయ పార్టీకి వత్తాసు పలకరాదని తమకు రిజర్వేషన్లను కల్పించేందుకు ఏవరైతే చిత్తశుద్ధితో ముందుకు వస్తారో వారికే 2019 ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం.

కాపు రిజ‌ర్వేష‌న్ల కోసం ప‌నిచేసే వారికే మ‌ద్ద‌తు ఇస్తామ‌ని జేఏసీ నాయ‌కులు చెప్పాల‌ని, విడి విడిగా నాయ‌కులెవ‌రూ మీడియాలో విరుద్ద ప్రకటనలు ఇవ్వొద్దని మాట్లాడ‌కూడ‌ద‌ని ఈ స‌మావేశంలో నిర్ణ‌యం తీసుకున్నారు. కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చిన అధికార పార్టీ టీడీపీ ..ఇప్పటి వరకు దీన్ని అమలు చేయకపోవడం. అలాగే ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేదని ప్రతిపక్ష నేతలు వ్యాఖ్యనిస్తున్న తరుణంలో ఈ భేటీ నిర్వహించడంతో వచ్చే ఎన్నికల్లో కాపులు ఎవరి పక్షాన నిలబడతారనే దానిపై ఉత్కంఠత నెలకొంది.