పల్నాడు జిల్లాలో 144 సెక్షన్కొ ఇంకా నసాగుతోంది. పోలింగ్ డే, ఆ తర్వాత జరిగిన హింసపై కేసులు కూడా నమోదు చేస్తున్నారు పోలీసులు. నిందితులని గుర్తించి అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. గురజాల నియోజక వర్గంలో మొత్తం మీద 192 మంది మీద కేసులు నమోదు అయ్యాయి. దాచేపల్లి మండలంలో 70 మంది మీద కేసులు నమోదు ( కేసానుపల్లి, నడికుడి, ఇరికెపల్లి, మాదినపాడు, దాచేపల్లి, ముత్యాలంపాడు గ్రామాల్లో గొడవలు జరిగాయి ) అయ్యాయి.
గురజాల మండలంలో ఇప్పటివరకు నమోదు చేసిన కేసులు 10 మంది( చర్లగుడిపాడు, దైద గ్రామాల్లో గొడవలు జరిగాయి )గా ఉన్నారు. మాచవరం మండలంలో 45 మంది మీద కేసులు నమోదు ( కొత్త గణేషునిపాడు, పిన్నెల్లి, మాచవరం గ్రామాల్లో గొడవలు జరిగాయి ) అయ్యాయి. పిడుగురాళ్ల మండలంలో 67 మంది కేసులు నమోదు (పెద్ద అగ్రహారం 30 మంది, కరాలపాడు 12 మంది, బ్రాహ్మణ పల్లి :25)అయ్యాయి. 307, 324, 323 సెక్షన్ల కింద కేసు నమోదు అయ్యాయి.