Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
Sekhar Kammula Re shooting Fidaa Movie Before Release
ఇటీవల తెలుగు సినిమాలకు రీషూట్లు ఎక్కువ అవుతున్నాయి. సినిమా అంతా పూర్తి అయిన తర్వాత ఎవరో ఏదో ఒక సీన్ లేదా రెండు సీన్స్‌లు సరిగా లేవు అని చెప్పడం, వాటిని రీ షూట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలకు ఇది ఎక్కువగా జరుగుతుంది. ఆ మద్య పలు మెగా హీరోల సినిమాలతో పాటు ఇతర హీరోల సినిమాలకు కూడా రీషూట్లు అయ్యాయి. తాజాగా ‘ఫిదా’ చిత్రానికి కూడా రీ షూట్‌ను చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు సినిమా విడుదల తేదీని ప్రకటించక ముందు రీ షూట్లు చేశారు. కాని ‘ఫిదా’కు మాత్రం రిలీజ్ డేట్‌ను ప్రకటించి రీ షూట్‌ను చేస్తున్నారు.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో దిల్‌రాజు బ్యానర్లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఫిదా’ ఈనెల 21న విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. వరుణ్ తేజ్, సాయి పల్లవి జంటగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది అంటూ ఇటీవలే ప్రకటించారు. అయితే దిల్‌రాజు కొన్ని సీన్స్ పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశాడని, దాంతో సినిమాకు సంబంధించి వారం రోజులు మళ్లీ రీ షూట్ చేయాలని నిర్ణయించారు. ఒక వైపు విడుదలకు సన్నాహాలు చేస్తూనే మరో వైపు రీ షూట్‌ను చేస్తున్నారు. రీషూట్ చేస్తున్నా కూడా అనుకున్న సమయంకు సినిమాను విడుదల చేస్తామని నిర్మాత చెబుతున్నాడు.
మరిన్ని వార్తలు:






