వివాదాస్పద గురువు రాంపాల్‌కు జీవిత ఖైదు…!

Self Styled Godman Rampal Sentenced To Life Imprisonment In 2 Murder Cases

స్వయం ప్రకటిత దేవుడిగా చలామణి అవుతున్న వివాదాస్పద గురువు రాంపాల్ బాబాకు ఓ హత్య కేసులో జీవితఖైదు విధిస్తున్నట్టు హరియాణాలోని హిస్సార్ స్థానిక న్యాయస్థానం ఆదేశించింది. 2014లో రెండు వేర్వేరు హత్య కేసుల్లో రాంపాల్‌తో పాటు అతని 27 మంది అనుచరులపై అభియోగాలు నమోదయ్యాయి. అక్టోబరు 11న హర్యానా కోర్టు రెండు హత్య కేసుల్లో రాంపాల్‌ను దోషిగా తేలుస్తూ తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దోషిగా తేలిన ఆయన్ను ఇవాళ కోర్డు శిక్ష ఖరారు చేసింది. మరో కేసులో అక్టోబరు 17న తీర్పు వెలువరించనుంది. రాంపాల్‌కు శిక్ష ఖరారు నేపథ్యంలో హిస్సార్‌ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కాగా, హర్యానాలోని బర్వాలా గ్రామంలో రాంపాల్ బాబాకు సత్ లోక్ ఆశ్రమం ఉంది. ఆయనకు భారీ సంఖ్యలో భక్తులు, అనుచరులు ఉన్నారు.

murder

బాబాకు శిష్యురాళ్లుగా ఉన్న తమ భార్యలు హత్యకు గురయ్యారని ఇద్దరు వ్యక్తులు వేర్వేరుగా పోలీసులకు గతంలో ఫిర్యాదు చేశారు. ఢిల్లీలోని బద్రపూర్ సమీపంలోని మిఠాపూర్ కు చెందిన శివపాల్, ఉత్తరప్రదేశ్ లోని లలిత్ పూర్ జిల్లా జఖోరా గ్రామానికి చెందిన సురేశ్ లు ఈ ఫిర్యాదులు చేశారు. దీంతో, 2014 నవంబర్ 19న రాంపాల్ బాబా, ఆయన అనుచరులపై బర్వాలా పోలీస్ స్టేషన్ లో రెండు కేసులు నమోదయ్యాయి. గతంలో రాంపాల్‌‌ను అరెస్టు చేయడానికి పోలీసులు ప్రయత్నించగా.. రాంపాల్‌ అరెస్ట్‌ను అడ్డుకునేందుకు ఆయన అనుచరులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. దాంతో కొన్ని రోజుల పాటు అరెస్ట్‌ నుంచి తప్పించుకోగా.. చివరకు పోలీసులకు అదుపులోకి తీసుకున్నారు. పలువురు అనుచరులను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆనాటి ఆందోళనల్లో ఆరుగురు మరణించగా, పదుల సంఖ్యలో మంది గాయపడ్డారు.

rampal-arrest