బుల్లితెర నటుడు, అడ్వొకేట్ జేఎల్ శ్రీనివాస్ ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. స్వతహాగా ఖమ్మం జిల్లాకే చెందిన ఆయన ఖమ్మం జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలోనే గులాబీ కండువా కప్పుకున్నారు. 30 ఏళ్లుగా తాను ఎన్నో సినిమాలు, సీరియల్స్ లో నటించానని ఆయన చెప్పుకొచ్చారు. 1969 ఉద్యమంలో కూడా పాల్గొన్నానని ఖమ్మం జిల్లాకు చెందిన తాను హైదరాబాదులో ఉంటున్నానని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారని, వాటికి ఆకర్షితుడనై తాను టీఆర్ఎస్ లో చేరానని చెప్పారు.
అలాగే రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో తన బృందంతో కలసి టీఆర్ఎస్ తరపున ఎన్నికల ప్రచారం చేస్తానని తెలిపారు. పార్టీ తరపున పలు కార్యక్రమాలను కూడా చేపడతానని 60 ఏళ్లలో చేయలేని పనులను కేవలం నాలుగేళ్లలో టీఆర్ఎస్ చేసిందని కొనియాడారు. సినీ పరిశ్రమ కోసం ఫిలింనగర్ ఎలా ఉందో బుల్లి తెర కోసం టీవీనగర్ స్థాపన జరగాలని కోరారు.