Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సహజంగా సినిమాలు విడుదలకు రెండు లేదా మూడు రోజుల ముందే లేదు అంటే వారం రోజుల ముందు సెన్సార్ కార్యక్రమాలకు వెళ్తాయి. కాని అజ్ఞాతవాసి మాత్రం రెండు వారాల ముందే సెన్సార్ కార్యక్రమాలకు సిద్దం అయ్యింది. ఇప్పటికే నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి అవ్వడంతో సెన్సార్ ముందుకు తీసుకు వెళ్లే యోచనలో దర్శకుడు త్రివిక్రమ్ ఉన్నట్లుగా తెలుస్తోంది. సెన్సార్‌ను 2017లో చేయించడం వల్ల అధికారికంగా సినిమా 2017కు చెందినది అవుతుంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేస్తే ప్రమోషన్ కార్యక్రమాలపై ఎక్కువ శ్రద్ద పెట్టవచ్చనే ఉద్దేశ్యంతో ముందే సెన్సార్‌ను పూర్తి చేయిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ 25వ చిత్రంగా తెరకెక్కిన ‘అజ్ఞాతవాసి’ చిత్రంపై అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మరోసారి పవన్ స్టామినాను చూపించడం ఖాయం అని, నాన్ బాహుబలి రికార్డులను బద్దలు కొట్టే సత్తా అజ్ఞాతవాసిలో ఉంది అంటూ మెగా ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు. కీర్తి సురేష్ మరియు అను ఎమాన్యూల్‌లు హీరోయిన్స్‌గా ఈ చిత్రంలో నటించారు. పవన్‌తో వీరిద్దరి రొమాన్స్ సినిమాకు హైలైట్‌గా ఉంటుందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
ఇటీవలే విడుదలైన పాటు సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఇక చిత్రం విడుదల దగ్గర పడుతున్న సమయంలో అంచనాలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. సెన్సార్ ముందుకు వెళ్తున్న నేపథ్యంలో అక్కడ నుండి ఎలాంటి టాక్‌తో బయటకు వస్తుందా అని సినీ వర్గాల వారు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ ల్యాండ్ మార్క్ చిత్రం అయిన ఈ చిత్రంను భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.