సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్టుగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న చిన్మయి ఏ విషయాన్నైనా చాలా అవలీలగా అందరితో పంచుకుంటుంది. తాజాగా ఈ అమ్మడు తనపై జరిగిన లైంగిక దాడుల గురించి పబ్లిక్‌గానే పోస్ట్ చేసింది. చాలామంది సెలబ్రిటీలకు ఇలాంటి సంఘటనలు ఎదురవుతాయి కానీ అందరు తమ కెరియర్ దృష్ట్యా గుట్టుగానే ఉంచుతారు కానీ చిన్మయి మాత్రం తన సెలబ్రిటీ స్టేటస్‌ను పక్కన పెట్టి తనపై జరిగిన అఘాయిత్యాలను గురించి పోస్ట్ చేసింది. ఈమెపై దాడి జరిగిన విధానం తెలిస్తే అంతా షాకవుతారు.
లైంగిక దాడుల గురించి చిన్మయి మాటల్లో… నాకు తొమ్మిదేళ్ల వయసున్నప్పుడు అమ్మతో నేను ఒక స్టూడియోకి వెళ్లాను, అమ్మ అక్కడ రికార్డింగ్‌లో ఉండగా నేను పక్కనే నిద్ర పోతున్నాను, అంతలోనే నా ప్రయివేటు పార్ట్స్‌ను ఎవరో తాకినట్టు అనిపించింది, దిగ్గున లేచే వరకు పక్కన ఓ పెద్దమనిషి! ఇక రెండోసారి టీనేజ్‌లో ఉన్నప్పుడు నా బైక్‌కు ఆక్సిడెంట్ అయి కింద పడిపోయాను, లేవలేనంతగా కుడి చేతికి దెబ్బ తగిలి అలానే పడి పోయి ఉన్నా, కొందరు కుర్రాళ్లు జేబులో ఏమున్నాయో చూస్తాము అనే నెపంతో నా చెస్ట్‌ని తాకారు, ఇకపోతే పందొమ్మిదేళ్ల వయస్సులో ఓ పెద్దాయన మాట్లాడుదాం రమ్మన్నాడు. అమ్మ నేను ఇద్దరం వెళ్లాం, నన్ను ఒక్కదాన్నే తన క్యాబిన్‌కు రమ్మన్నాడు, బాగా తెలిసిన వారు పైగా పెద్దవారు సో ఏలాంటి భయం లేకుండా తన రూమ్‌కు వెళ్లా కానీ లోపలికి వెళ్లగానే టేబుల్ పక్కనుండి వచ్చి గట్టిగా హగ్ చేసుకుని చాలా అసభ్యంగా ప్రవర్తించాడు అంటూ చిన్మయి తనపై జరిగిన లైంగిక దాడుల గుట్టు రట్టు చేసింది. ఈ విధంగా తనపై జరిగిన దాడులను బయటపెట్టిన చిన్మయి మహిళలపై జరుగుతున్న దాడుల విషయంలో మీటూ అంటూ తన వంతు ప్రయత్నం చేస్తోంది.